– మాసోజు చంద్రం, ఘట్కేసర్
ముందు మీ ఇల్లు తూర్పుకుందా, ఉత్తర దిక్కుకుందా అనేది మీరు చెప్పలేదు. ఇంటి ఫ్లోరింగ్ అనవసరంగా పెంచడం మంచిది కాదు. ఇంటి ముందు రోడ్డు నుంచి ఇల్లు అంతా కలిపి మూడున్నర ఫీట్లు ఉంటే చాలు. రోడ్డు వెడల్పు, ర్యాంపు ఎత్తు ఎంత వస్తుందో చూసుకొని ఫ్లోరింగ్ నిర్ణయించాలి. మీరు రోడ్డును పెంచుతామని అంటున్నారంటే ఎత్తు చాలా ఉందని అర్థమవుతుంది. రోడ్డు పెంచినప్పుడు ఇతరుల ఇంటి ముందు కంటే మీ ఇంటి ముందున్న రోడ్డు ఎక్కువ అవుతుంది.
పైగా భవిష్యత్తులో ప్రభుత్వం రోడ్లు వేసినప్పుడు మీరు పెంచిన రోడ్డును తొలగించేందుకు ఆస్కారం ఉంది. అలా కాకుండా ఫ్లోరింగ్ తగ్గించుకోవాలి. అప్పుడు సులభంగా కారు తదితర వాహనాలు లోపలికి వెళతాయి. ర్యాంపు స్లోపు రావాలి కాబట్టి ఎటు దిక్కు అయినా చేయవచ్చు. మిగతాదంతా ఒకే లెవల్లో ఉండి వాస్తుపరంగా ఎలాంటి ఇబ్బంది కలిగించదు.
– కోల వసంతలక్ష్మి, చెన్నూరు
గది ఆవరణలో ఎక్కువ వస్తువుల సముదాయం ఉంటే దాని అంతరంగ క్షేత్రం అల్లరి చిల్లరిగా ఉంటుంది. ఏ గది అయినా మనం వాడుకునేదే కదా. ప్రతి గది ఓ ప్రత్యేకతతో నిర్మితమై ఉంటుంది. కాబట్టి దానికి తగిన జాగ్రత్తలు అవసరం. ముఖ్యంగా ఉత్తరం దిశ సానుకూల వాతావరణాన్ని ప్రభావితం చేస్తుంది.

అటు బరువులు వేలాడదీసినా, సెల్పుల్లో పెట్టినా అది విరుద్ధ భంగిమలో ఉండి మనసులో చికాకును కలిగిస్తుంది. కాబట్టి ఏ విధానంలోనూ ఉత్తరం నింపరాదు. మనిషి గమనం ముందుకు సాగే విధంగా శరీరం నిర్మీతమై ఉంటుంది. ప్రధానంగా తూర్పు, ఉత్తర దిక్కుల్లో మన ప్రయాణాన్ని
సాగిస్తున్నా ఆ వైపు ఖాళీగా ఉండే ఆవరణం మనలో ఉత్సాహాన్ని కలిగిస్తుంది.
– వెంకట్రామి రెడ్డి, బోయిన్పల్లి(హైదరాబాద్)
రోడ్లు అన్నీ కొనసాగవు. వెంచర్లు చేసే కాలనీల్లో వేసే రోడ్లన్నీ ఆగిపోయేవే కదా. మన నగరాల్లో కట్టే విల్లాస్, గేటెడ్ కాలనీలకు ఒక పరిధిలో హద్దులు మూసేసి రక్షణ గోడలను నిర్మిస్తారు. ఇది కోరుకునే అందులో ఇండ్లు కొంటున్నారు. ఆ రోడ్డు మీ ఇంటి వరకే ఆగిపోతే.. అదే డెడ్ ఎండ్ అవుతుంది కాబట్టి దోషముంటుంది.

అప్పుడు అలాంటి వాటికి దూరం ఉండాలి. కానీ మీ ఇంటికి రెండు ఇండ్ల తర్వాత ఆగిపోయింది కాబట్టి మీరు భయపడాల్సిన పని లేదు. మిగతా ఇంటి విభాగంలో ఏమైనా లోటుపాట్లు ఉంటే సరిచేసుకోండి. మారుతున్న వర్తమాన స్థితి గతులను బట్టి ఇండ్ల నిర్మాణాలు చేసుకుంటున్నారు. మనం శాస్ర్తానుగుణంగా ఉన్న వాటిని ముందుగా చూసుకొని
కొనుగోలు చేస్తే మంచిది.
– బద్దుల రాధ, పెంబర్తి
స్థలం చిన్నగున్నా, పెద్దగున్నా మీరు నిర్ణయించుకున్నట్లు ఇల్లు కట్టుకోవచ్చు. ఇప్పుడున్న అపార్ట్మెంట్లను చూడండి.. కార్లు పెట్టడానికి కింద సిల్టు భాగం వదిలిపెట్టి పైన ఇండ్లను కట్టుకొని ఉంటున్నారు. మీరు కూడా కింద స్థలంలో పార్కింగ్‌కు వదిలేయండి. మొత్తం ఖాళీగా వదిలితేనే ఆ స్థలంలో వాహనాలు పెట్టుకునేందుకు స్థలం ఉంటుంది. చిన్నగా రూమొకటి వేయాలన్న ఆలోచన ఉంటే విరమించుకోండి.

చిన్న స్థలానికి వెడల్పు తక్కువ ఉండి పొడవు ఎక్కువ ఉంటుంది కాబట్టి మొత్తం ఖాళీగా ఉంటేనే మంచిది. అలాగే రెండువైపులా వచ్చే పిల్లర్ల మధ్య నైరుతిలో అవసరం ఉన్నంత వరకు గేటు పెట్టుకోవచ్చు. పైన ఇల్లు ప్లాన్ చేసుకున్నారు కాబట్టి కింద అనుకున్న విధంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్లాన్
చేయవచ్చు.
-సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 98492 78143