– బి. శేఖర్, మోత్కూర్.
ఊరు నిర్మాణంలో దేవాలయం ప్రధానంగా ఉన్నట్లయితే.. ఏ ఊరు అయినా శాస్త్రబద్ధంగా అమరి ఉంటుంది. అందుకే గ్రామ నిర్మాణం, నగర నిర్మాణం అనేది ఎంతో నిబద్ధతతో చేసేవారు. ఇప్పటికీ ఆనాటి గ్రామాలు, నగరాలు దిశలతో ఉన్నాయి. ఇష్టం వచ్చినట్టు చేసిన లే అవుట్ల మూలంగా నేడు ఎన్నో కొత్తకాలనీలు వాస్తు లేకుండా వెలవెలబోతున్నాయి. మీ ఊరి చరిత్ర తెలియదు.
కానీ, ఊరి పరిసరాలు అంటే.. ఆయా ఊళ్ల సరిహద్దులు, ప్రధానంగా కొండలు, నదులు, వాగులు, చెరువులు, ఎడారులు ఉంటే.. ఆయా గ్రామాలపైన తప్పకుండా ప్రభావం కలగజేస్తాయి. ‘కొండ కింది ఊరు – బండ కింద బతుకు’ అన్నట్టు.. తూర్పు – ఉత్తరాలు.. కొండలు ఉంటే, ఆ ఊరి ఎదుగుదలపైనా, ఆ ఊరి యువతపైనా ప్రభావం విరుద్ధంగానే ఉంటుంది. సంచిలాగా ఒకవైపు మాత్రమే ఎంట్రీ ఉండి, అదికూడా నైరుతి అయితే.. ఆ ఊరి ప్రజల ఆరోగ్యాలు బాగుండవు. కొన్ని ప్రాంతాలు అలాగే ఉంటాయి.
– సిహెచ్ భానుప్రసాద్, సనత్‌నగర్.
ఒక పెద్ద స్థలంలో ఆఫీస్, ఇల్లు ప్లాన్ చేసినప్పుడు.. కిచెన్, డైనింగ్ మధ్యలో రాకూడదు. పడమర భాగంలో ఉచ్ఛమైన స్థానంలో ఇంటిని నిర్మించి, దానిని ఒక కాంపౌండుతో వేరుచేసి, మిగిలిన తూర్పు భాగంలో ఆఫీస్‌ను, కిచెన్, డైనింగ్ ప్లాన్ చేయాలి.
తూర్పు – ఈశాన్యం నుంచి ప్రత్యేకమైన మార్గంలో ఇంటికి దారి వదిలి, మిగతా స్థలంలో ఒక కిచెన్, డైనింగ్ ఆగ్నేయంలో కట్టుకొని.. ఆ స్థలంలోని పడమరలో ఆఫీస్ కట్టాలి. అలా దక్షిణం పారు తప్పకుండా వరుసగా చూస్తే.. పడమర ఇల్లు, ఆ తర్వాత ఆఫీస్, ఆ తర్వాత ఆగ్నేయంలో కిచెన్, డైనింగ్ హాల్ నిర్మించడం శ్రేష్ఠం. ఆ విధంగా ముందు డివిజన్ చేసి, ప్లాన్ చేసుకొని కట్టాలి.
– బి. శకుంతల, ధర్మపురి.
చాలాకాలం క్రితం కట్టిన ఇండ్లు కొన్నిచోట్ల హద్దులమీద కట్టారు. అలాగే బస్తీల్లో కూడా స్థలం వదలకుండా కట్టడం వల్ల ఇలాంటి సమస్య వస్తుంది. మీ ఇంటికి దక్షిణంలోని ‘మీ కాంపౌండుకు’ ఇతరుల ఇల్లు ఆనుకొని ఉందా? మీ దక్షిణం గోడ.. పక్కవారి ఉత్తరంగోడ అంటుకొని ఉన్నాయా? అనేది మీరు వివరంగా రాయలేదు.
మీకు దక్షిణం ఖాళీ ఉంటే మంచిదే! అలాకాకుండా.. దక్షిణం ఏమాత్రం ఖాళీ మీరుకూడా వదలకుండా కట్టిన ఇల్లు అయితే ఏమీకాదు. కానీ, మీకు తప్పకుండా పడమర – తూర్పు – ఉత్తరంలో ఖాళీస్థలం ఉంటే భయపడాల్సిన పనిలేదు. దక్షిణంతోపాటు అటు ఉత్తరం కానీ, తూర్పు కానీ ఖాళీ లేకుండా ఇండ్లు అంటుకొని ఉంటే ఏమాత్రం మంచిదికాదు. తప్పకుండా ఇల్లు మారాలి. లేదా ఖాళీని ఏర్పాటు చేసుకోవాలి.
– ఆర్. కిరణ్మయి, గజ్వేల్.
ఉత్తరం, పాత ఇల్లు కొనడం మంచిదే! కానీ, ఉన్న ఇంటిని అంటుకొని మరో ఇల్లు కట్టాలి అంటే ఎంతో మార్పు చేయాల్సి వస్తుంది.. ఇప్పుడు మీరు ఉన్న ఇంటిలో! ఉత్తర భాగం కొనగానే ఆ స్థలం, అలాగే ఉంటున్న పాత ఇంటిస్థలం కలిసి పెద్దగా అవుతుంది. అలా చూసినప్పుడు ఆ స్థలానికి తగిన ఇల్లు కట్టాల్సి వస్తుంది. పాత ఇంటిలోకి కలపాలి అనుకుంటే.. హాలు, అలాగే డ్రాయింగ్ రూములు మారుతాయి.
ఇప్పుడు ఉన్న ప్రధాన ద్వారం కూడా మారుతుంది. ఆ విధంగా.. ఒకే ఇంటి రూపంగా వచ్చేలా జాగ్రత్తలతో చేసుకోండి. అలాగే మొత్తం ఇంటికి చుట్టూ ఖాళీ సరిగ్గా వాస్తుకు ఉండేలా చూసుకోవాలి. అంతేకాదు.. స్లాబ్ కలిపినప్పుడు రాబోయే రోజుల్లో లీకేజీ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాకాదు.. పాతఇల్లు కూడా తీసేసి మొత్తంగా ఒక కొత్త ఇంటిని కూడా కట్టుకోవచ్చు.
-సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 98492 78143