సాధారణంగా గ్రామాల్లో అయితే.. ఇండ్లు విశాలంగా ఉంటాయి. ఎందుకంటే.. అక్కడ లాండ్కు అంతగా విలువ ఉండదు. తక్కువ ధర ఉంటుంది కాబట్టి.. ఎక్కువ ప్లేస్ కొనుక్కొని.. విశాలంగా ఇండ్లు కట్టుకుంటారు. అదే సిటీల్లో అయితే.. అంత విశాలంగా ఇండ్లు ఉండవు. కాస్త ఇరుకుగానే ఉంటాయి. కానీ.. ఒక నగరం ఉంది. ఆ నగరం ఎంత ఇరుకుగా ఉంటుంది అంటే.. ఆ నగరం ప్రపంచంలోనే అత్యంత నగరంగా గుర్తింపు పొందింది.
ఆ నగరంలో ఖాళీ ప్లేస్ లేక.. ఏకంగా ఓ నది చుట్టూ ఇండ్లు, అపార్ట్మెంట్లు కట్టేశారు. ఇంతకీ ఆ నగరం ఎక్కడుంది. దాని పేరు ఏంటి? అంటారా? ఆ నగరం పేరు యాంజిన్. చైనాలోని యున్నన్ ప్రావిన్స్‌లో ఉంటుంది ఈ నగరం. దీన్ని నాంగ్జి అనే నది చుట్టూ నిర్మించారు. మధ్యలో నది.. చుట్టూ ఎత్తైన కొండలు.. నది ఒడ్డున ఈ నగరాన్నినిర్మించారు. అందుకే.. ఈనగరం ఎవ్వరికీ కనిపించదు. పైనుంచి చూస్తే.. ఇది ఒక శాండ్‌విచ్‌లా కనిపిస్తుంది.
ఇక.. ఈ నగరాన్ని అంత ఇరుకైన నగరం అని ఎందుకంటారంటే.. ఈ సిటీ 30 మీటర్ల నుంచి 300 మీటర్ల వెడల్పు మధ్య మాత్రమే ఉంటుంది. ఈ సిటీ మొత్తాన్ని కలిపే ఒక మెయిన్ రోడ్డు, మధ్య మధ్యలో కొన్ని బ్రిడ్జిలు అంతే. నది ఒడ్డునే ఇండ్లను నిర్మిస్తారు, అపార్ట్మెంట్లను కూడా నది ఒడ్డునే నిర్మించడం కోసం ప్రత్యేక టెక్నాలజీని వాడుతారు. సన్నని పిల్లర్స్‌ను వాడి అపార్ట్‌మెంట్స్‌ను నిర్మిస్తారు. నది ఒడ్డున తప్పించి.. ఇండ్లు నిర్మించుకోవడానికి ఖాళీ ప్లేస్ ఉండదు. ఎందుకంటే.. నది చుట్టూ కొండ ప్రాంతం ఉంటుంది కాబట్టి.. ఆ నది ఒడ్డునే ఇరుకు ఇరుకుగా ఇండ్లను నిర్మించుకున్నారు అక్కడి జనాలు.
డ్రోన్ ద్వారా తీసిన ఈ సిటీ వీడియో ప్రస్తుతం చైనీస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోను చూస్తే.. ఎవ్వరైనా ఆ సిటీకి వెళ్లి అక్కడే ఉండాలని అనుకుంటారు. కానీ.. ఆ సిటీ ఉన్న ప్రాంతం కొండ ప్రాంతం కావడం వల్ల.. అక్కడ ట్రాన్స్ పోర్ట్ పెద్ద సమస్య. ఆర్థికంగా కూడా ఆ సిటీ అంతగా డెవలప్ కాలేదు.