Viral Video | ఓ మహిళ ప్రమాదకరమైన స్టంట్‌ను ప్రదర్శిస్తున్న వీడియో ఒకటి ఆన్లైన్లో చక్కర్లు కొడుతోంది. సాధారణంగా నేలపై నిల్చొని స్కిప్పింగ్ (skipping) చేయడం కాస్త కష్టంతో కూడుకున్న పనే. స్కిప్ చేస్తున్న సమయంలో ఆ తాడు కాళ్లకు తట్టుకుంటే చిన్నపాటి ప్రమాదం జరిగే అవకాశం లేకపోలేదు. అలాంటిది ఓ మహిళ ఎంతో సాహసంతో ఏకంగా సైకిల్ తొక్కుతూ స్కిప్పింగ్ చేసింది. షాక్ అవుతున్నారు కదూ.. ! మీరు విన్నది నిజమే. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
వీడియోలో సదరు మహిళ ట్రెడిషనల్ దుస్తులు ధరించి సైకిల్‌పై వెళ్తూ కనిపించింది. మధ్యలో సైకిల్‌ను బ్యాలెన్స్ చేస్తూనే తాడుతో స్కిప్పింగ్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. అదే సమయంలో మహిళ సాహసానికి ఫిదా అవుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం ఆ మహిళ రిస్కీ స్టంట్‌పై మీరూ ఓ లుక్కేయండి.
Also Read..
Leo | లియో సందడి.. థియేటర్లో రింగ్స్ మార్చుకున్న కాబోయే కొత్త జంట
Air India Express | నయా లుక్‌లో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు.. ఫొటోలు వైరల్
Giant Wheel | నవరాత్రి మేళాలో అకస్మాత్తుగా నిలిచిపోయిన జెయింట్ వీల్.. 20 మంది గాల్లోనే