ప్రపంచంలోనే అత్యంత వేగంగా పరుగెత్తే జంతువు చిరుత. స్పోర్ట్స్ కారంత స్పీడ్‌గా పరుగెడుతుంది. కానీ, కళ్లముందు ఓ జింక ఉన్నా వేటాడలేకపోయింది. చూస్తూ ఉండిపోయింది. మరి దానికి ఒంట్లో బాగాలేదా అంటే అదీ కాదు..చాలా యాక్టివ్గానే ఉంది. కారణం ఏమై ఉంటుందని ఆలోచిస్తున్నారా? ఏమీ లేదండి ఆ రెండింటికీ మధ్య పెద్ద కంచె ఉంది. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ఈ వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నందా ట్విటర్లో పెట్టాడు. ఈ వీడియోలో జింక గడ్డిమేస్తూ ఉంటుంది. అవతలివైపు ఆకలితో ఉన్న చిరుత..జింకను చూస్తూ ఉంటుంది. ఈ వీడియోకు విండో షాపింగ్ అని సుశాంత నందా క్యాప్షన్ ఇచ్చారు. 75వేల మంది వీడియోను వీక్షించగా, 5.2వేల మంది లైక్ చేశారు. పలువురు ఫన్నీ కామెంట్లతో హోరెత్తించారు.
Window shopping by Cheetah… pic.twitter.com/x3p7PvdNS6
— Susanta Nanda IFS (@susantananda3) March 12, 2022