సోషల్‌మీడియాలో కొన్ని వీడియోలు కంటికి ఇంపుగా ఉంటాయి. అందుకే నెటిజన్లు వాటిని పదేపదే చూస్తుంటారు. ఈ వీడియోకూడా అదే కోవకు చెందినది. రెండు వేర్వేరు కలర్ సూప్‌లతో చైనా చిహ్నం ఇన్ అండ్ యాంగ్‌ను రూపొందించాడు ఓ చెఫ్. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ఈ వీడియోను సీక్రేఫ్యాక్ట్స్ తన ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఇందులో ఒక చెఫ్ తన రెండు చేతుల్లో రెండు వేర్వేరు రంగుల సూప్‌ను ఓ బౌల్లో నేర్పుగా పోస్తుంటాడు. చివరికి అది చైనా చిహ్నమైన ఇన్ అండ్ యాంగ్ రూపును సంతరించుకుంటుంది. ఈ వీడియోను ఇప్పటివరకూ 21లక్షల కంటే ఎక్కువమంది వీక్షించారు. చాలామంది కామెంట్లతో హోరెత్తించారు.