ఓ న్యూస్ చానల్ జర్నలిస్ట్ పుతిన్ గురించి అభిప్రాయాలు సేకరిస్తున్నాడు. ఇందులో భాగంగా ఓ మహిళను పుతిన్ తెలుసా? అని అడిగాడు. అందుకామె ఏమో నేనెప్పుడూ తినలేదు అని సమాధానమిచ్చింది. ఈ వీడియో నెట్టింట నవ్వులు పూయిస్తున్నది.
రష్యా అధ్యక్షుడు పుతిన్ గురించి ఓ జర్నలిస్ట్ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాడు. ఓ మహిళ దగ్గరకు వెళ్లి పుతిన్ తెలుసా? అనగానే ఆమె నేను పౌటిన్ తినను..దాని గురించి నాకు తెలియదు అని సమాధానం ఇచ్చింది. దీంతో అక్కడున్నవారంతా బిగ్గరగా నవ్వారు. వెంటనే తేరుకున్న ఆ మహిళ తాను పౌటిన్ అనే ఆహార పదార్థం గురించి అడుగుతున్నారనుకున్నా అని జవాబిచ్చింది. మీరడిగింది వ్లాదిమిర్ పుతిన్ గురించా? నో వైబ్స్ అంటూ సమాధానమిచ్చింది.