లోతైన సముద్రాల్లో స్కూబా డ్రైవింగ్ అంటే సాహసమనే చెప్పాలి. చాలామంది స్కూబా డ్రైవర్లు అత్యంత లోతుకెళ్లి సముద్ర అంతర్భాగ చిత్రాలు తీస్తుంటారు. కాగా, 721 అడుగుల లోతులో ఓ స్కూబా డ్రైవర్‌పై 5 అడుగుల స్వార్డ్‌ఫిష్ అకస్మాత్తుగా దాడి చేసింది. ఈ భయానక వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
బ్రెజిల్ తీరంలో సముద్ర ఉపరితలం నుంచి 721 అడుగుల లోతులో స్కూబా డ్రైవర్‌పై స్వార్ట్ ఫిష్ దాడిచేసింది. ఈ 57 సెకన్ల వీడియోలో స్వార్డ్ ఫిష్.. స్కూబా డ్రైవర్ వెంటపడగా, అతడు గైడింగ్ తాడును పట్టుకొని దానినుంచి చాకచక్యంగా తప్పించుకుంటాడు. ఈ వీడియో రెడ్డిట్‌లో వైరల్ అయ్యింది.
Diver gets attacked by swordfish at 721 feet (220 m) below the surface pic.twitter.com/pXHtgIILrX
— Domenico (@AvatarDomy2) March 10, 2022