పారాగ్లైడింగ్ అంటే సాహసంతో కూడుకున్నది. వాతావరణం అనుకూలిస్తే ఓకే. కానీ ఎదురుగాలులు వీచినప్పుడు పారాగ్లైడర్స్ తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. ఇలాంటి చేదు అనుభవమే ఓ పారాగ్లైడర్‌కు ఎదురైంది. సుడిగాలి దెబ్బకు అతడు కంచెపై పడి, అక్కడినుంచి చెట్టుపైకి వెళ్లిపోయాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ఆస్ట్రియా దేశంలోని స్టీర్మార్క్లో ఓ పారాగ్లైడర్ టేకాఫ్‌కు సిద్ధంగా ఉన్నాడు. అంతలోనే సుడిగాలి అతడిని లాక్కెళ్లింది. మొదట అతడు కంచెకు ఢీకొట్టాడు. అటుతర్వాత అతడిని సుడిగాలి ఓ చెట్టుపైకి లాక్కెళ్లింది. చెట్టుపై చిక్కుకుపోయి ఇతరుల సహాయం కోసం అరవసాగాడు. అక్కడే ఉన్నవారు అతడిని చెట్టుపైనుంచి దించారు. అతడికి పెద్దగా దెబ్బలేమీ తగలేదు కానీ..పారాగ్లైడ్ పాడైపోయింది. ఈ 20 సెకన్ల వీడియో క్లిప్నే వేలాదిమంది వీక్షించారు.