గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోతోందంటూ ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని నిరసనలు చేసినా పర్యావరణానికి కలుగుతున్న హాని గురించి ఎవరికీ పెద్దగా పట్టడం లేదు. కొన్ని దేశాలు కూడా ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోకపోవడం గమనార్హం. ఇలాంటి సమయంలో ప్రకృతిని మనం ఎంత చెడగొట్టామో చెప్పేందుకు ఒక ఫొటోగ్రాఫర్ నడుంబిగించాడు.
104 ఏళ్ల క్రితం అంటే 1918లో ఆర్కిటిక్ వద్ద తీసిన ఒక ఫొటోను రిక్రియేట్ చేశాడు. పాత ఫొటోలో పర్వతాలు కనిపించనంత ఎత్తులో ఉన్న మంచు కనిపిస్తే.. తాజా ఫొటోలోని మంచు కనీసం ఆ పర్వతాలను సగం కూడా కప్పలేకపోయాయి.
‘‘ఈ ఫొటోలో బోట్ స్థానం, పర్వతాల కన్నా కూడా ఇది చెప్పే నిజం, పంపే మెసేజ్ చాలా ముఖ్యమని నాకు తెలుసు’’ అంటూ నీల్ డ్రేక్ అనే ఫొటోగ్రాఫర్ దీన్ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇది చూసిన ప్రజలు షాక్ అవ్వాలనే దీన్ని తీశానని తెలిపాడు. ప్రస్తుతం నెట్టింట ఈ ఫొటో బాగా వైరల్ అవుతోంది.