కొందరి సంతకాలు వెరైటీగా ఉంటాయని తెలుసు కానీ..మరీ ఇంత వెరైటీనా.. అనేలా ఉంది ఈ సిగ్నేచర్..గువహటి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ అధికారి సంతకం నెట్టింట వైరల్ అవుతోంది. దీన్ని చూసి ఆశ్చర్యపోని నెటిజన్ లేడంటే అతిశయోక్తి కాదు..
గువహటి మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ రిజిస్ట్రార్ మార్చి 4, 2022న చేసిన సంతకం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై సోషల్‌మీడియాలో నెటిజన్లు కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. తాను ఇంతవరకూ ఇలాంటి సంతకం చూడలేదనీ, పెన్ పనిచేస్తుందా? లేదా అని పరీక్షించేందుకు మనం పేపర్‌పై రాసినట్లుగా ఈ సంతకం ఉందని ఒకరు కామెంట్ చేశారు. ఇది ముళ్ల పందిలా ఉందని మరొకరు ఫన్నీ కామెంట్ చేశారు. ఒకరైతే ఇది చీపిరికట్టలా ఉందంటూ చమత్కరించారు.
I have seen many signatures but this one is the best. pic.twitter.com/KQGruYxCEn
— Ramesh 🇮🇳 🚩 (@Ramesh_BJP) March 20, 2022
And this one? 😂https://t.co/S030n0PnjU
— Srinivas Manooru 🇮🇳 శ్రీనివాస్ మణూరు 🇮🇳 (@AbodeOfLakshmi) March 20, 2022