టిక్‌టాక్ మన దేశంలో బ్యాన్ అయిన యాప్. కానీ, చాలాదేశాల్లో టిక్‌టాక్‌పై నిషేధం లేదు. కాగా, ఓ యువతి టిక్‌టాక్‌లో ఫేమస్ అయిన సంజ్ఞలను ఉపయోగించి తన ప్రాణాలను కాపాడుకుంది. తనను చంపేయాలని డిసైడ్ అయ్యి కిడ్నాప్ చేసిన మాజీప్రియుడి చెరనుంచి తప్పించుకుంది.
అమెరికాకు చెందిన యువతి తన సోదరుడి ఇంటికి వెళ్లేందుకు బయలుదేరింది. మధ్యలో ఆమె మాజీప్రియుడు జోనాథన్ స్మిత్ కలిశాడు. ఆమెను కిడ్నాప్ చేశాడు. కారులో వెళ్తున్నంతసేపు ఆమె తప్పించుకునేందుకు ప్రయత్నించింది. కానీ కుదర్లేదు. తనకు దక్కనిది ఎవరిరీ దక్కకూడదని, ఆమెను చంపేస్తానని బెదిరించాడు. ఆమెను హతమార్చేందుకు తన స్నేహితునితో కలిసి ఓ చోటుకి తీసుకెళ్లబోతున్నట్లు చెప్పాడు. కొద్దిసేపటి తర్వాత నిందితులు కారును పెట్రోల్ బంకువద్ద ఆపారు.
యువతిని కారులోనే బంధించి.. జోనాథన్, అతడి స్నేహితుడు పెట్రోల్ బంకులోకి వెళ్లారు. కాగా, సదరు మహిళ అన అరచేతిని ముందుకు చాచి టిక్‌టాక్‌లో వైరల్ అయిన డిస్ట్రెస్ సంజ్ఞను క్యాషియర్‌కు చూయించింది. వెంటనే ఆ క్యాషియర్ ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ 911కి కాల్ చేశాడు. పోలీసులు రంగప్రవేశం చేయగా.. స్మిత్, అతడి స్నేహితుడు ఆ యువతిని తీసుకుని అక్కడినుంచి వెళ్లిపోయారు.
పోలీసులు వారిని వెంబండించారు. 15 నిమిషాల చేజింగ్ తర్వాత జోనాథన్ కారును పోలీసులు ఢీకొట్టారు. జోనాథన్, అతడి స్నేహితుడు పారిపోతుండగా పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. ఈ ఘటనలో యువతికి గాయాలేమీ కాలేదు. జోనాథన్ స్మిత్‌పై పోలీసులు కిడ్నాప్ కేసు పెట్టారు.