న్యూఢిల్లీ : తండ్రీ కొడుకుల మధ్య అనుబంధం మాటల్లో వర్ణించలేం. తండ్రీ కొడుకులు ఒకరి పట్ల మరొకరు ఆప్యాయతను బాహాటంగా చాటుకోకపోయినా ఒకరి పట్ల మరొకరికి అవ్యాజమైన ప్రేమ అల్లుకునిఉంటుంది. ఇక 75 ఏండ్ల కొడుకు 105 ఏండ్ల వయసున్న తన తండ్రి కోసం పాట పాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Father is 100+, son is 75. Can the coming generation sustain such relationships 🙏 pic.twitter.com/QHhcqBSOnC
— Tweet-today🇮🇳 (@goodpersonSrini) February 16, 2023
ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. శ్రీని అనే యూజర్ ట్విట్టర్లో ఈ వీడియోను షేర్ చేయగా ఇప్పటివరకూ 2.5 లక్షల మందికి పైగా వీక్షించారు. ఈ వైరల్ వీడియో నెటిజన్లను కన్నీరు పెట్టిస్తోంది. నిమిషం పైగా నిడివి కలిగిన ఈ వీడియోలో 68 ఏండ్ల వయసున్న వ్యక్తి 105 ఏండ్ల తండ్రి కోసం పాట ఆలపించడం కనిపిస్తుంది.
ఈ క్లిప్‌ను చూసిన యూజర్లు తండ్రీకొడుకుల అనుబంధాన్ని చూసి చలించిపోయారు. వీరి బాండింగ్ తమ గుండెలను తాకిందని ఓ యూజర్ కామెంట్ చేయగా బ్యూటిఫుల్ అంటూ మరో యూజర్ ప్రశంసించారు.