మనుషులకు రోబోలంటే ఇష్టం. తమలాగే కనిపించే, తమలాగే ప్రవర్తించే రోబోలుంటే బాగుండు అని ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటారు. అయితే, రోబోలు మనుషుల్లాగా కనిపించినప్పటికీ..వాటిని చూడగానే గగుర్పాటు కలుగుతుంది. ఇక మనుషుల్లాంటి యంత్రాల తయారీ గురించి మాట్లాడితే ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త ఆల్బర్ ఐన్‌స్టీన్ రోబోలు ఎప్పుడూ ముందువరుసలో ఉంటాయి. తాజాగా, ఓ ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ముఖాన్ని పోలిన రోబో ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది.
ఈ వీడియోను మేకప్షెల్ అనే యూజర్ ఇన్‌స్టాలో అప్లోడ్ చేశారు. ఐన్‌స్టీన్ ఐకానిక్ హెయిర్‌స్టైల్‌తో రోబో గగుర్పాటు కలిగించే విధంగా నవ్వుతూ కనిపించింది. ఈ రోబో తన తలను ఊపుతూ, కన్నుకొట్టడంతోపాటు నాలుకను బయటపెట్టింది. ఈ వీడియోకు ఇప్పటివరకూ మిలియన్ వ్యూస్ వచ్చాయి. 61,000 లైకులతో ఆన్లైన్లో చక్కర్లు కొడుతోంది.