సింహాలు.. ఏనుగులకు బద్ధ శత్రువులు. ఏనుగులు కనిపిస్తే చాలు సింహాలు వెంటపడి వేటాడుతాయి. ఇప్పటివరకూ అలాంటి ఎన్నో వీడియోలను మనం చూశాం. కానీ, ఏనుగులకు భయపడి సింహాలు పరుగెత్తడం ఎప్పుడైనా చూశారా..? అలాంటి ఒక వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఏనుగుల గుంపు మీదికొస్తే పిల్లుల్లా భయపడి సింహాలు అక్కడినుంచి జారుకున్నాయి.
ఈ వీడియోలో కొన్ని సింహాలు చెట్టు కింద కూచున్నాయి. ఆకలితో ఉన్న సింహాలు ఏవైనా జంతువులు అటుగా వస్తే వేటాడుదామని చూస్తున్నాయి. అయితే, ఓ ఏనుగుల మంద కసిగా వాటిమీదికి వచ్చేసరికి పిల్లుల్లా అక్కడినుంచి పారిపోయాయి. ఈ వీడియోకు ఇప్పటివరకూ 35,000 వ్యూస్ వచ్చాయి. చూసినవారంతా సరదా కామెంట్లు చేస్తున్నారు.