ఛీ.. ఛీ.. నీదేం మొహంరా.. ఈ ఫేస్ దేనికీ పనికిరాదురా అని కొందరు అద్దంలో చూసుకుంటూ తమ ముఖాన్ని తామే తిట్టుకుంటూ ఉంటారు. కానీ.. మీ ముఖానికి ఉన్న విలువ ఎంతో తెలిస్తే ఇంకోసారి అలా చేయరు. మీ ముఖాన్ని ముద్దు చేస్తారు. మీ ముఖానికి కనీసం రూ.1.5 కోట్లు పలుకుతుంది అంటే నమ్ముతారా. అది కూడా కేవలం మీ ఫేస్ ప్రింట్ మాత్రమే ఇస్తే చాలు. మీ ఫేస్ ప్రింట్‌ను అమ్మేసినందుకు మీకు అంత డబ్బు ముట్టచెబుతారు. మీకు కూడా మీ ఫేస్ ప్రింట్‌ను అమ్మాలనుకుందా? పదండి.. ఇంకాస్త వివరంగా తెలుసుకుందాం.
ప్రోమోబాట్ అనే రోబోటిక్స్ తయారీ కంపెనీ ఇస్తున్న ఆఫర్ అది. ఆ కంపెనీ తయారు చేసే రోబోలను మనిషి ముఖాన్ని అమర్చాలని భావించింది. దీంతో ఎవరైనా తమ ముఖానికి సంబంధించిన రైట్స్‌ను అమ్మితే వాళ్లకు రూ.1.5 కోట్లు ఇస్తామని కంపెనీ ప్రకటించింది.
కాకపోతే కొన్ని కండిషన్లు పెట్టింది. ముఖానికి సంబంధించిన రైట్స్ ఇవ్వాలనుకునే వాళ్ల వయసు కనీసం 25 ఏళ్లు దాటి ఉండాలి. ముఖం చూడటానికి సింపుల్‌గా, ఫ్రెండ్లీగా ఉంటే చాలు.. అని కంపెనీ ప్రకటించింది.
త్వరలోనే హ్యూమనాయిడ్ రోబోలను మార్కెట్లోకి సప్లయి చేస్తున్నట్టు కంపెనీ ప్రకటించింది. దాని కోసమే మనుషుల ముఖాలను అమర్చాలని కంపెనీ భావిస్తోంది. యూఎస్‌కు చెందిన ఈ కంపెనీకి మీ ముఖాన్ని ఇవ్వాలనుకుంటే వెంటనే ఆ కంపెనీ వెబ్‌సైట్‌కు వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు.
సెలెక్ట్ చేసిన వాళ్ల 3డీ ముఖాన్ని స్కాన్ చేసుకొని.. జీవితాంతం వాళ్ల ముఖం రైట్స్‌ను కంపెనీకి ఇచ్చేయాల్సి ఉంటుంది. వాళ్ల ముఖంతో పాటు వాయిస్‌ను కూడా స్కాన్ చేసుకుంటారు. ఆరోబోతో ముఖాన్ని ఇచ్చిన వ్యక్తి వాయిస్‌తోనే లింక్ చేసి మాట్లాడేలా చేస్తారు.
మరి ఇంకెందుకు ఆలస్యం.. మీరు యూఎస్‌లో ఉంటే వెంటనే ఆ కంపెనీ వెబ్సైట్ ద్వారా సంప్రదించి.. మీ ముఖం రైట్స్‌ను అమ్మేసి కోటీశ్వరులు కండి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
దైవాన్ని చేరుకోవడానికి ఈ తొమ్మిది మార్గాలు ఎంతో కీలకం.. అవేంటో తెలుసా
చివరి నిమిషంలో ఫుడ్ ఆర్డర్ చేశాడు.. రెస్టారెంట్ ఏం డెలివరీ చేసిందో తెలుసా?
జాబ్ కావాలి.. మెట్రో స్టేషన్ వద్ద రెజ్యూమ్‌తో నిరుద్యోగి.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా?
పురిటి నొప్పులు వస్తున్నా.. సైకిల్ తొక్కుతూ ఆసుపత్రికి వెళ్లి బిడ్డకు జన్మనిచ్చిన ఎంపీ