ఫుడ్ డెలివరీ ఏజెంట్‌ను చెంపపై కొట్టిన ట్రాఫిక్ పోలీస్… బదిలీ వేటు
చెన్నై: ఫుడ్ డెలివరీ ఏజెంట్‌ను చెంపపై కొట్టిన ట్రాఫిక్ పోలీస్‌పై బదిలీ వేటు పడింది. తమిళనాడులోని కోయంబత్తూరులో ఈ సంఘటన జరిగింది. ఒక సంస్థకు చెందిన ఫుడ్ డెలివరీ ఏజెంట్ మోహన సుందరం, శుక్రవారం సాయంత్రం తన బైక్‌పై వెళ్తున్నాడు. అవినాషీ రోడ్డ్లోని ఫన్ మాల్ జంక్షన్ వద్ద రోడ్డు పక్కగా బైక్‌ను ఆపి మొబైల్ ఫోన్లో మాట్లాడుతున్నాడు. ఇంతలో అటుగా వస్తున్న ఒక స్కూల్ బస్సు అతడి బైక్‌తోపాటు పాదాచారుడ్ని ఢీకొట్ట బోయింది. దీంతో మోహన సుందరం వెంటనే బైక్‌ను ఆ స్కూల్ బస్సు ముందుకు తీసుకెళ్లి అడ్డంగా ఆపి డ్రైవర్‌తో ఘర్షణకు దిగాడు. దీంతో ట్రాఫిక్‌కు స్వల్ప అంతరాయం ఏర్పడింది.
ఇది చూసిన ట్రాఫిక్ కానిస్టేబుల్ సతీష్ అక్కడకు వెళ్లాడు. ఫుడ్ డెలివరీ ఏజెంట్ మోహన సుందరం చెంపపై పలు మార్లు కొట్టాడు. ఈ స్కూల్ బస్సు యజమాని ఎవరో తెలుసా? అని ప్రశ్నించాడు. ఆ బస్సుకు సంబంధించి ఏమైనా ట్రాఫిక్ సమస్యలు ఉంటే తామే చూస్తామని అన్నాడు. అనంతరం ఫుడ్ డెలివరీ ఏజెంట్ మొబైల్ ఫోన్, బైక్ తాళాలను బలవంతంగా తీసుకుని అక్కడి నుంచి ముందుకు వెళ్లిపోయాడు.
కాగా, అటుగా వెళ్తున్న ఒక వ్యక్తి తన మొబైల్ ఫోన్లో దీనిని రికార్డు చేశాడు. ‘వియ్ లవ్ కోవై’ అనే ట్విట్టర్ ఖాతాలో ఈ వీడియో పోస్ట్ అయ్యింది. దీంతో ఫుడ్ డెలివరీ వ్యక్తిని ట్రాఫిక్ కానిస్టేబుల్ చెంపపై కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
మరోవైపు బాధిత ఫుడ్ డెలివరీ ఏజెంట్ మోహన సుందరం ఈ సంఘటనపై సిటీ పోలీస్ కమిషనర్‌కు శనివారం ఫిర్యాదు చేశాడు. దీంతో అక్కడి సీసీటీవీ ఫుటేజ్‌తోపాటు వైరల్ వీడియో క్లిప్‌ను పరిశీలించిన సీనియర్ అధికారులు రంగంలోకి దిగారు. ట్రాఫిక్ పోలీస్ సతీష్‌ను కంట్రోల్ రూమ్‌కు బదిలీ చేశారు.
"This happened yesterday evening at the fun mall signal and there was a slight traffic block due to this delivery boy and all of a sudden this Cop Started beating up the Delivery person "
. #welovecovai
.
👉 IG : FB :TW @WELOVECOVAI
.#coimbatore #delivery #deliveryboy #traffic pic.twitter.com/OBEwmghc1R— We Love Covai ❤️ (@welovecovai) June 4, 2022
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srinidhi Shetty | బ్లాస్ట్ సినిమాతో ఎలాంటి కనెక్షన్ లేదు.. ‘ఆదర్శకుటుంబం’ హీరోయిన్ శ్రీనిధి శెట్టి
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
ఇరవెండి పంచాయతీ నిర్వహణపై డీపీవో అనూష ప్రశంస
Former Minister Talasani | ఓటరు నమోదు ముమ్మాటికీ ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలోనే జరగాలి : మాజీ మంత్రి జరగాలని తలసాని
‘అవినీతికి తావులేకుండా విధులు నిర్వహించాలి’
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

