Viral Video : ఇంటర్నెట్లో చిత్ర విచిత్ర ఫుడ్ కాంబినేషన్స్ తెగ వైరలవుతున్నాయి. న్యూ రెసిపీలతో ప్రయోగం చేస్తున్న జనం వినూత్న ఫుడ్ కాంబోలతో ముందుకొస్తున్నారు. పిజా పానీ పూరీ, చాక్లెట్ పరాటా నుంచి కాఫీ మ్యాగీ వరకూ వెరైటీ కాంబినేషన్లతో కూడిన వీడియోలను నెట్టింట పోస్ట్ చేస్తున్నారు.
ఇక ఈ జాబితాలోకి లేటెస్ట్గా బటర్ పావ్‌కు కుల్ఫీ జోడించిన వీడియో వచ్చిచేరింది. ఈ వీడియోను ఇంటర్నెట్ యూజర్ మహ్మద్ ఫ్యూచర్‌వాలా ఎక్స్ వేదికగా షేర్ చేశారు. ఈ షార్ట్ క్లిప్‌లో వీధి వ్యాపారి ఈ డిష్‌ను ప్రిపేర్ చేయడం కనిపిస్తుంది. ఈ సాల్ట్-స్వీట్ కాంబినేషన్‌పై నెట్టింట హాట్ డిబేట్ సాగింది. ఈ పోస్ట్ మైక్రోబ్లాగింగ్ సైట్‌పై షేర్ చేసినప్పటి నుంచి పెద్దసంఖ్యలో వ్యూస్ లభించాయి.
Butter Pav Bhaji hui purani,
Khao garma garam,
Butter Kulfi Pav,
Aur yeh hai Gujarat ki Kahani!!! pic.twitter.com/OrC8BgafVl
— Mohammed Futurewala (@MFuturewala) February 4, 2024
థ్యాంక్స్ గాడ్ వీరు దానిపై చాక్లెట్ సిరప్‌తో కూడిన ఆమ్లెట్‌ను యాడ్ చేయలేదని ఓ నెటిజన్ సెటైర్లు వేశారు. అన్యాయం, దారుణమని మరో ఎక్స్ యూజర్ కామెంట్స్ సెక్షన్లో రాసుకొచ్చారు. ఇక మయనీస్ చీజ్, ధనియాలు ఎవరు వేస్తారని మరో యూజర్ ప్రశ్నించారు. ఇదేం పుడ్ కాంబినేషన్ అని మరికొందరు నెటిజన్లు ఫైరయ్యారు.
Read More :
Gobi Manchurian | అక్కడ గోబీ మంచూరియాపై బ్యాన్.. ఎందుకంటే..?
Read More :