e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, December 5, 2021
Home News Squid Game : స్క్విడ్ గేమ్ వీఐపీ యాక్ట‌ర్ గెయోఫ్రే గుర్తున్నాడా? ఆయ‌న‌కు ఇండియాతో క‌నెక్ష‌న్ ఉంద‌ట‌

Squid Game : స్క్విడ్ గేమ్ వీఐపీ యాక్ట‌ర్ గెయోఫ్రే గుర్తున్నాడా? ఆయ‌న‌కు ఇండియాతో క‌నెక్ష‌న్ ఉంద‌ట‌

స్క్విడ్ గేమ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పుకోవాల్సిన అవ‌స‌రం లేదు. నెట్‌ఫ్లిక్స్‌లో గ‌త నెల విడుద‌లైన ఈ వెబ్ సిరీస్ ప్ర‌స్తుతం సంచ‌ల‌నాల‌ను సృష్టిస్తోంది. నెట్‌ఫ్లిక్స్ చ‌రిత్ర‌లోనే ఈ కొరియ‌న్ వెబ్‌సిరీస్ అత్య‌ధిక వ్యూస్ సాధించి రికార్డు క్రియేట్ చేసింది.

స్క్విడ్ గేమ్ చూసిన వాళ్ల‌కు.. ఆ సిరీస్‌లో వ‌చ్చే వీఐపీల గురించి తెలిసే ఉంటుంది. జంతువుల మాస్క్‌లు ధ‌రించి వాళ్లు ఐలాండ్‌కు వ‌చ్చి గేమ్ ఆడుతున్న వాళ్ల‌ను చూస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. లైవ్‌లో గేమ్‌ను చూస్తూ గేమ్‌లో ఓడిపోయిన వాళ్లను చంపేస్తుంటే చూసి ఆనందిస్తుంటారు.

- Advertisement -

స్క్విడ్ గేమ్‌లో ఉన్న వీఐపీల్లో ఒక‌రైన గెయోఫ్రే గైలియానోకు ఇండియాతో క‌నెక్ష‌న్ ఉంద‌ట‌. వీఐపీతో పాటు.. అందులో మెయిల్ లీడ్‌లో న‌టించిన అనుప‌మ్ త్రిపాఠీ ఇండియ‌నే. అత‌డిది ఢిల్లీ. ఈ షోలో అనుప‌మ్ త్రిపాఠీ.. అలీ అనే పాత్ర‌లో న‌టించాడు. ఆ త‌ర్వాత ఇండియాతో క‌నెక్ష‌న్ ఉన్న మ‌రో వ్య‌క్తి వీఐపీ గెయోఫ్రే.

68 ఏళ్ల వ‌య‌సు ఉన్న ఈ అమెరిక‌న్ న‌టుడు ఒక ర‌చ‌యిత కూడా. ప్ర‌స్తుతం గెయోఫ్రే థాయిలాండ్‌లో ఉంటున్నాడు. గ‌త సంవ‌త్స‌రం ఇండియా క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభించిన‌ప్పుడు గెయోఫ్రే ఇండియాలోనే ఉన్నాడ‌ట‌. త‌న కొడుకును తీసుకొని తాజ్ మ‌హ‌ల్ చూడ‌టానికి ఇండియాకు వ‌చ్చాడ‌ట‌. అలాగే.. ఢిల్లీలో ఓ ఆసుప‌త్రిలో డాక్ట‌ర్‌ను క‌న్స‌ల్ట్ అవడానికి వ‌చ్చాడ‌ట‌. కానీ.. క‌రోనా వ‌ల్ల త‌న కొడుకుతో పాటు ఇండియాలోనే కొన్ని రోజుల పాటు చిక్కుకుపోయాడ‌ట గెయోఫ్రే. క‌రోనా వ‌ల్ల విదేశీ విమానాల‌న్నీ ర‌ద్దు అవ‌డంతో చేసేది లేక ఇండియాలోనే గ‌డ‌పాల్సి వ‌చ్చింద‌ట‌.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చదవండి..

Sandwich: బుల్లెట్ బండి మీద శాండ్‌విచ్‌ అమ్ముతున్నాడు.. వీడియో వైర‌ల్‌

Spider inside Woman’s Ear : మ‌హిళ చెవిలో దూరిన సాలీడు..

70 ఏళ్ల వ‌య‌సులో పండంటి బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన వృద్ధురాలు..

Viral Video : ప్ర‌పంచంలోనే అత్యంత పెద్ద పాము.. దీన్ని మోయ‌డానికి క్రేన్‌నే తీసుకొచ్చారు

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement