లక్నో: ఒక బాలుడు అశ్లీల వీడియోలకు బానిస అయ్యాడు. మద్యం కూడా సేవించిన అతడు తల్లి పక్కన నిద్రిస్తున్న 9 నెలల చిన్నారిని ఎత్తుకెళ్లాడు. పొలాల్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. దర్యాప్తు చేసిన పోలీసులు ఆ బాలుడ్ని అదుపులోకి తీసుకున్నారు. (Boy Rapes 9 Months Girl) ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. గులారిహా పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామానికి చెందిన 9 నెలల పాప శుక్రవారం రాత్రి తల్లి పక్కన నిద్రించిన తర్వాత అదృశ్యమైంది. దీంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆ చిన్నారి కోసం వెతికారు.
కాగా, శనివారం తెల్లవారుజామున ఇంటికి సుమారు 500 మీటర్ల దూరంలోని పొలంలో ఉన్న షెడ్ వద్ద తీవ్ర రక్తస్రావంతో ఏడుస్తూ ఆ శిశువు కనిపించింది. కుటుంబ సభ్యులు తొలుత కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. ఆ పాప పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం బీఆర్డీ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి రిఫర్ చేశారు. ఆ చిన్నారిపై లైంగిక దాడి జరిగినట్లు వైద్య పరీక్షలో నిర్ధారణ అయ్యింది.
మరోవైపు ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మూడు రోజుల కిందట చండీగఢ్ నుండి వచ్చిన బంధువైన 12 ఏళ్ల బాలుడిని అనుమానించారు. ఆదివారం అతడ్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. తొలుత పొంతన లేని సమాధానాలు చెప్పినప్పటికీ చివరికి నేరాన్ని అంగీకరించాడని పోలీస్ అధికారి తెలిపారు. శుక్రవారం రాత్రి మద్యం సేవించిన ఆ బాలుడు తన మొబైల్ ఫోన్లో అశ్లీల వీడియోలు చూశాడని చెప్పారు. ఆ తర్వాత తల్లి పక్కన నిద్రిస్తున్న చిన్నారిని ఎత్తుకెళ్లాడని, పొలంలోని షెడ్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీస్ అధికారి వివరించారు.
అయితే నిందితుడైన ఆ బాలుడు అశ్లీల వీడియోలకు బానిసైనట్లుగా తెలుస్తున్నదని పోలీసులు తెలిపారు. అతడి మొబైల్ ఫోన్లో 50కు పైగా అశ్లీల వీడియోలు, వందకు పైగా అశ్లీల వెబ్సైట్ల కోసం చేసిన సెర్చ్ వివరాలు లభించినట్లు చెప్పారు. ఆ బాలుడ్ని జువైనల్ హోమ్‌కు తరలించినట్లు పోలీస్ అధికారి తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.