Soda shop job | ఇండియాలో అన్ఎంప్లాయిమెంట్ రోజురోజుకు పెరిగిపోతుంది. డిగ్రీ పట్టాలు తీసుకొని పాస్ ఔట్ అవుతున్న వారి సంఖ్య భారీగా ఉంది.. చదువుకు తగ్గ జాబ్ తెచ్చుకుంటున్న వారేమో తక్కువగా ఉన్నారు. ఈ క్రమంలో సోడా షాప్‌లో హెల్పర్‌గా పని చేస్తే జీతం రూ.6లక్షలు ఇస్తా అని ఓ యజమాని చెప్తున్న వీడియో వైరల్ అవుతుంది. ఈ వీడియోను ఏకంగా 9.3 మిలియన్ల మంది ఈ వీడియో చూశారు. ఇంతకీ ఆ షాప్ ఎక్కడో చూద్దాం రండి..
బోపాల్ (bhopal)లో నరేంద్ర రాజ్‌పూత్ అనే వ్యక్తి సోడాస్టాల్ నడుపుతున్నాడు. షాప్‌లో (soda stall) పని చేయడానికి ఓ హెల్పర్(Soda Shopkeeper) కుర్రాడు కావాలని అతను బోర్డ్ పెట్టాడు. షాప్‌కు వచ్చిన ఓ కస్టమర్ జీతం ఎంత ఇస్తావ్ అని అడగగా.. అది విని కస్టమర్ షాక్ అయ్యాడు. సంవత్సరానికి చేతికి రూ.6లక్షలు ఇస్తానని నరేంద్ర రాజ్‌పుత్ చెప్పాడు. అతను ఓ ఫ్రెషర్లను షాప్ లో పెట్టుకోవాలని చూస్తున్నని కూడా చెప్పాడు. కస్టమర్ యజమానిని షాప్ మీద నువ్ ఎంతో సంపాధిస్తావని అడిగాడు. నరేంద్ర అతని ఇన్‌కం చెప్పలేదు. కానీ.. జాబ్ కావాలంటే రూ.6లక్షలు (job with good Salary) ఇవ్వడానికి రెడీగా ఉన్నానని చెప్పాడు. ఈ విషయం వీడియో చూసిన అందర్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్లు రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు.
అతను షాప్ పాపులారిటీ పెంచుకోవడానికి అలా చెప్పాడని కొందరు అంటే.. ఇన్ఫోసిస్ కంటే ఎక్కువ జీతం ఇస్తున్నాడని మరో వ్యక్తి కామెంట్ చేశాడు. అంతేకాదు సీవీ సెండ్ చేయాలా అని కూడా చాలామంది అడిగారు. కొందరు సరదాగా వర్క్ ఫ్రం హోం కుదురుతుందా, షిఫ్ట్‌లు ఏంటని వీడియోకి కామెంట్ చేస్తున్నారు. ఇలా ఫన్నీ కామెంట్లతో ఈ వీడియో వైరల్(viral video) అవుతుంది.