Top Tweets 2022 | ఈ ఏడాది టాప్ ట్వీట్స్ ఇవే.. బ్లాక్ పాంథర్ హీరో మరణ వార్తకు అత్యధిక లైక్స్
కొరియన్ బాయ్ బ్యాండ్ బీటీఎస్ ట్వీట్ 30.1 లైక్స్‌తో 8వ ప్లేస్‌లో
Top Tweets 2022 : సోషల్‌మీడియా సైట్లలో ట్విట్టర్ వాడకం చాలా ఎక్కువ. సెలబ్రటీల నుంచి రాజకీయ నాయకుల దాకా ట్విట్టర్ వేదికగా అభిమానులతో టచ్‌లో ఉంటారు. 2022లో కొందరు సెలబ్రిటీలు, ప్రపంచనేతల ట్వీట్స్‌కు లక్షల్లో లైక్స్ వచ్చి పడ్డాయి. వాటిలో అత్యధిక లైక్స్ సాధించిన పది ట్వీట్స్ జాబితాలో బ్లాక్ పాంథర్ హీరో ఫ్యామిలీ చేసిన ట్వీట్‌తో పాటు ఎలన్ మస్క్, జో బిడెన్, బరాక్ ఒబామా, బీటీఎస్ బ్యాండ్ ట్వీట్స్ ఉన్నాయి. బ్లాక్ పాంథర్ నటుడు చాడ్విక్ బోస్మన్ మరణాన్ని ధ్రువీకరిస్తూ అతని కుటుంబం పోస్ట్ చేసిన ట్వీట్‌కు అత్యధిక లైక్స్ వచ్చాయి. ఈ ట్వీట్‌ను 70 లక్షల మంది లైక్ చేశారు. ‘నేను కోకాకోలా కంపెనీని కొనబోతున్నా. మళ్లీ కొకైన్‌ను తీసుకొస్తాను’ అంటూ 2022 ఏప్రిల్‌లో ఎలన్ మస్క్ చేసిన ట్వీట్ రెండో స్థానంలో ఉంది. ఈ ట్వీట్‌ను 40.7 లక్షల మంది లైక్ చేశారు.
అమెరికా మాజీ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా చిన్నపిల్లల వంక చూస్తూ నవ్వుతున్న ట్వీట్ 40 లక్షల లైక్స్‌తో మూడో స్థానంలో ఉంది. మూడో స్థానంలో అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు జో బిడెన్ ట్వీట్ ఉంది. అమెరికాలో ‘ఇది కొత్త రోజు’ అంటూ ఆయన చేసిన ట్వీట్‌ను 30.8 లక్షల లైక్స్ వచ్చాయి. విమాన ప్రమాదంలో చనిపోయిన బాస్కెట్ బాల్ క్రీడాకారుడు కొబె బ్రయాంట్, అతని కూతురు గురించి ఒబామా చేసిన ట్వీట్ 30.6 లక్షల లైక్స్ సాధించింది. ‘ఈ రోజు భూమిని వదిలి వెళ్లిన వ్యోమగాములకు శుభాకాంక్షలు. నిజంగా మంచి నిర్ణయం’ అంటూ అమెరికా నటుడు ఆండీ మిలోనకిస్ ట్వీట్స్ 30.4 లక్షల ట్వీట్స్‌తో ఆరో స్థానంలో ఉంది.
ట్విట్టర్ కొనుగోలు సమయంలో ‘నన్ను విమర్శించేవాళ్లు కూడా ట్విట్టర్లో ఉంటారు. ఎందుకంటే.. భావ వ్యక్తీకరణ అంటే అదే’ అని ఎలన్ మస్క్ చేసిన ట్వీట్‌కు 30.2 లక్షల లైక్స్ వచ్చాయి. కొరియన్ బాయ్ బ్యాండ్ బీటీఎస్ ట్వీట్ 30.1 లైక్స్‌తో 8వ ప్లేస్‌లో ఉంది. ట్విట్టర్ కంపెనీ చేసిన ‘హల్లో లిటెరల్లీ ఎవ్రీవన్’ ట్వీట్ 30.1 లక్షల లైక్స్‌తో తొమ్మిదో స్థానంలో నిలిచింది. తన వయసు గురించి అమెరికా నటుడు మెకాలే కల్కిన్ చేసిన ట్వీట్ 30 లక్షల లైక్స్‌తో పదో స్థానంలో ఉంది.
— Chadwick Boseman (@chadwickboseman) August 29, 2020
Next I’m buying Coca-Cola to put the cocaine back in
— Elon Musk (@elonmusk) April 28, 2022
Next I’m buying Coca-Cola to put the cocaine back in
— Elon Musk (@elonmusk) April 28, 2022
It’s a new day in America.
— Joe Biden (@JoeBiden) January 20, 2021
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

