ప్రయత్నం చేయాలేగానీ అసాధ్యం అనేది లేదని నిరూపించింది ఈ చిన్నారి. ఒంటికాలితో స్కేటింగ్ చేసి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. అర్జెంటీనాకు చెందిన ఈమె పేరు మిలీ ట్రెజో. ఈమె అర్జెంటీనా అడాప్టవ్ స్కేటింగ్ నేషనల్ ఛాంపియన్షిప్లో పాల్గొంది. ఆ పోటీల్లో అందరితో పోటీగా స్కేటింగ్ చేసి విజేతగా నిలిచింది. ఈమె ఈమధ్య ఒంటి కాలితో స్కేటింగ్ ప్రదర్శన ఇచ్చింది. మిలీ ఒక్క కాలుతోనే చాకచక్యంగా స్కేటింగ్ చేయడం, తన శరీరాన్ని బ్యాలెన్స్ చేసుకోవడం చూసి ప్రేక్షకులంతా చప్పట్లు కొడుతూ ఈ చిన్నారిని ప్రోత్సహించారు. తన ప్రదర్శన తర్వాత పరుగున వెళ్లి అక్కడే ఉన్న తన తల్లి కౌగిలించుకుంది మిలీ.
మిలీ తనకు ఒక్క కాలు మాత్రమే ఉందని ఎప్పుడూ నిరుత్సాహపడలేదు. తనకి ఎంతో ఇష్టమైన స్కేటింగ్ నేర్చుకుంది. నేర్చుకోవడమే కాదు నేషనల్ ఛాంపియన్గా నిలిచింది కూడా. పట్టుదల ఉండాలేగానీ ఏదీ కూడా అసాధ్యం కాదని చాటి చెప్పింది. ఈమధ్య ఆమె స్కేటింగ్ చేస్తున్న వీడియోను గుడ్న్యూస్ కరెస్పాండెంట్ అనే యూజర్ ట్విట్టర్లో పెట్టారు. ఆ వీడియోలో రెండు కాళ్లు ఉన్నవాళ్లతో పోటీగా ఆమె స్కేటింగ్ చేయడం చూసిన నెటిజన్లు ఆమె ఆత్మవిశ్వాసాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. ఈ వీడియోని ఇప్పటికే 12వేల మందికిపైగా చూశారు. అర్జెంటీనా అడాప్టివ్ స్కేటింగ్ నేషనల్ ఛాంపియన్గా నిలిచింది మిలీ.
Nothing is impossible.
Mily Trejo is the Argentine National Champion of adaptive skating.
Mom’s hug at the end 😭.
— GoodNewsCorrespondent (@GoodNewsCorres1) November 4, 2022