టాలీవుడ్ హీరోయిన్ సమంత ఫిట్‌నెస్‌కు అధిక ప్రాధాన్యతనిస్తున్నది. జిమ్‌లో ఎక్కువసేపు గడుపుతున్నది. ఆమె జిమ్‌లో చేస్తున్న వర్కౌట్స్ వీడియోలను ఇన్‌స్టాలో పెడుతున్నది. తాజాగా, డెడ్‌లిఫ్ట్స్ విత్ స్వ్కాట్స్ చేసి ఆశ్చర్యపరిచింది. భారీ బరువులను సునాయాసంగా మోసి, ఔరా అనిపించింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నది.
ఫిట్నెస్ ట్రైనర్ జునైద్ శిక్షణలో సమంతరుతుప్రభు జిమ్‌లో డెడ్‌లిఫ్ట్స్ విత్ స్వ్కాట్స్ చేసింది. హెవీ వెయిట్స్‌ను అమాంతం ఎత్తేసి వావ్ అనిపించింది. ఈ వీడియోకు ‘బలమైన శరీరం, బలమైన మనస్సు’ అని సమంత క్యాప్షన్ ఇచ్చింది. అలాగే, 2022-23 తనకు చాలా శారీరక శ్రమతో కూడుకున్న సమయమని పేర్కొంది. సమంత వర్కౌట్స్ వీడియో చూసి ఆమె ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.