Mercedes Benz | సూరత్ నగరంలోని ప్రసిద్ధ డ్యూమాస్ బీచ్‌కి వినోదానికి వెళ్లిన కొందరు యువకులు చేసిన స్టంట్స్‌కి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఖరీదైన బెంజ్ కారులో బీచ్‌కు వచ్చిన వారు, అధికారుల నిషేదాజ్ఞలు లెక్కచేయకుండా కారుతో స్టంట్స్ చేసేందుకు ప్రయత్నించారు. దాంతో చిక్కుల్లో పడాల్సి వచ్చింది. వివరాలలోకి వెళితే సదరు యువకులు అధికారుల హెచ్చరికలను పట్టించుకోకుండా కారును బీచ్‌లోకి తీసుకెళ్లారు. అక్కడ స్టంట్స్ చేయాలనే ఉద్దేశంతో నిబంధనలను ఉల్లంఘించారు.దాంతో బెంజ్ కారు ఇసుకలో చిక్కుకుపోయింది, కారు సగం వరకూ నీట మునిగిపోయింది.
కారు ఇసుకలో ఇరుక్కుపోవడంతో యువకులు తీవ్రంగా ప్రయత్నించారు. టైర్లకు చుట్టు ఉన్న మట్టిని తొలగించి, దాన్ని ముందుకు నెట్టేందుకు ఎంతగానో శ్రమించారు. కానీ ఫలితం లేకుండా పోయింది. ఈ సంఘటనను పక్కనే ఉన్న వ్యక్తులు తమ ఫోన్లలో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో, అది కాస్తా విపరీతంగా వైరల్ అయింది. ఈ ఘటనపై స్థానిక పోలీసులు స్పందించారు. నిబంధనలకు విరుద్ధంగా బీచ్‌లోకి కారు తీసుకెళ్లిన ఘటన తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. వీడియో ఆధారంగా కారు నంబర్, యజమాని వివరాలు, స్టంట్స్ చేసిన సమయం వంటి సమాచారం సేకరించే ప్రయత్నంలో ఉన్నామని పేర్కొన్నారు.
ప్రస్తుతం ఈ వీడియో ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో విపరీతంగా షేర్ అవుతోంది. ఈ ఘటన పోలీసుల నిబంధనలను పాటించకపోతే ఫలితాలు ఎలా ఉంటాయో స్పష్టంగా తెలియజెప్పింది. సరదా పేరుతో ఇలా నిబంధనలను తుంగలో తొక్కడం వలన ప్రమాదాలు కొని తెచ్చుకుంటారని అధికారులు హెచ్చరిస్తున్నారు. సోషల్ మీడియా ప్రభావం వలన ఈ మధ్య ఇలాంటి స్టంట్స్ ఎక్కువై పోతున్నాయి. ఒకడు రైలు కింద పడుకొని రీల్ చేస్తే, ఇంకొకడు నీళ్లతో సాహసాలు చేస్తూ వీడియో తీసుకుంటాడు. ఇవన్నీ ప్రమాదాలు అని తెలిసిన కూడా రిస్క్‌లు చేస్తూ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.
At Surat’s Dumas Beach, a Mercedes decided to play submarine.
The rich brats tried explaining, but the car had its own attitude, “I’m not made for roads anymore… sea calling!”😆pic.twitter.com/70ajUwDt48
— Kumar Manish (@kumarmanish9) July 21, 2025