Viral News | ఒక మనిషికి సాటి మనిషి సాయం చేసేందుకు ముందుకు రాని ప్రస్తుత సమాజంలో.. మూగ జీవాలు సాయం చేసుకుంటూ ప్రజలకు పాఠాలు నేర్పుతున్నాయి. తోటి మూగ జీవికి కష్టం వస్తే వెంటనే స్పందించి సైన్యంలా ఎదురు దాడికి దిగుతున్నాయి. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా తోటి ప్రాణిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాయి. తాజాగా అలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది.
పైతాన్.. ప్రపంచంలోనే అత్యంత పెద్ద విషసర్పం. ప్రమాద కరమైంది కూడా. మనిషైనా, జంతువైనా దీని గుప్పిట్లో పడ్డామంటే వదిలించుకోవడం దాదాపుగా అసాధ్యం. తాజాగా ఓ కోతి పైతాన్ చేతికి చిక్కింది. ఇంకేముంది ఆ కోతిని చుట్టుకుని ఊపిరాడకుండా ఉక్కిరిబిక్కిరి చేసేసింది. ఇది చూసిన ఓ వానర సైన్యం.. పైతాన్ గుప్పిట్లో ఉన్న కోతిని రక్షించేందుకు ప్రయత్నించింది. అయితే, ఆ విషసర్పం వానర సైన్యంపై ఎదురుదాడికి దిగుతూ భయాందోళనకు గురి చేసింది. ఇందుకు సంబంధించిన దృష్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి.