సాధారణంగా ఏదైనా వాహనం సడెన్‌గా రోడ్డు మీద ఆగిపోతే ఏం చేస్తాం చెప్పండి. అందులోనుంచి దిగి.. దాన్ని రోడ్డు పక్కకు నెట్టడమో లేక.. అది స్టార్ట్ అవడం కోసం కాస్త ముందుకు నెట్టడమో చేస్తుంటాం. కారు.. బస్సు లాంటి వాహనాలు అయితే ఓకే కానీ.. ట్రెయిన్‌ను ముందుకు నెట్టడం సాధ్యం అవుతుందా? అలాగే విమానాన్ని నెట్టడం సాధ్యం అవుతుందా? కానీ.. కొందరు దాన్ని సాధ్యం చేశారు. రన్‌వేపై విమానం టైర్ పంక్చర్ అయితే.. దాన్ని రన్‌వే నుంచి తప్పించేందుకు విమానంలో ఉన్న ప్రయాణికులంతా కిందికి దిగి.. దాన్ని పక్కకు తోయాల్సి వచ్చింది.
ఈ ఘటన నేపాల్‌లో చోటు చేసుకుంది. తారా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం బజురా ఎయిర్‌పోర్ట్‌లోని రన్‌వేపై ఆగిపోయింది. ఏమైందని చూస్తే దాని వెనుక టైర్ పంక్చర్ అయింది. రన్‌వేపై వేరే విమానాలు వస్తే ప్రమాదం జరుగుతుందని.. వెంటనే ప్యాసెంజర్లు అందరినీ దించి.. వాళ్లతోనే ఆ విమానాన్ని రన్‌వే నుంచి పక్కకు తప్పించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు ఆ వీడియోను చూసి కొందరు ఫన్నీగా.. మరికొందరు ఘాటుగా కామెంట్లు చేస్తున్నారు. చివరకు ప్రయాణికులతో విమానాన్ని కూడా నెట్టిస్తున్నారా? రన్‌వేపై విమానాలు మధ్యలో ఆగిపోవడం ఏంటి.. అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
सायद हाम्राे नेपालमा मात्र होला ! pic.twitter.com/fu5AXTCSsw
— Samrat (@PLA_samrat) December 1, 2021
Really @FlyYeti 😳😳😳🤔🤔
— 𝔅𝔦𝔪𝔞𝔩 𝔎𝔥𝔞𝔫𝔞𝔩 (@KhnlBml) December 1, 2021
Ignorant ppl are making fun of #TaraAir 's video after a burst tire, can happen to any airline, but this is more fault of @hello_CAANepal who do not have required ground equipment in STOL airports it operates. They charge airlines good money but don't provide the service needed. https://t.co/nWnYy2lASg
— Masked 😷 & Fully Vaxxed 💉 (@GuyAirline) December 2, 2021
God bless the guys on the wheels https://t.co/GUPuWnzrg3 pic.twitter.com/gMmHa1i0B0
— 🧛🏻♂️ (@tucheliball) December 1, 2021
That guy pushing the wheels who thinks he is contributing.😂😂 https://t.co/py7A2dIOOf
— Sauhard (@jsauhard) December 1, 2021