నీరజ్ చోప్రా.. ప్రస్తుతం ఈ పేరు దేశమంతా మార్మోగిపోతోంది. ఒలింపిక్స్ క్రీడల్లో అథ్లెటిక్స్ విభాగంలో తొలిసారి భారత్‌కు గోల్డ్ మెడల్‌ను అందించి.. భారతదేశ సత్తాను ప్రపంచానికి చాటి చెప్పాడు అథ్లెట్ నీరజ్ చోప్రా. జావెలిన్ త్రో విభాగంలో 87.58 మీటర్ల త్రో విసిరి.. గోల్డ్ మెడల్ సాధించాడు. దీంతో నీరజ్ చోప్రాకు భారత్ అంతా నీరాజనాలు పలికింది. దేశమంతా ముక్తకంఠంతో నీరజ్‌ను ప్రశంసల్లో ముంచెత్తింది. ముఖ్యంగా యువత అయితే.. సంబురాలు కూడా చేసుకుంది. నీరజ్ చోప్రాకు సోషల్ మీడియాలో కూడా క్రేజ్ పెరిగింది. ఆయన ఒలింపిక్స్ క్రీడలకు వెళ్లకముందు.. తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో కేవలం 1.43 లక్షల ఫాలోవర్స్ మాత్రమే ఉండేవారు.
కానీ.. ఆయన ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించాక మాత్రం ఆయన అకౌంట్లో పాలోవర్స్ విపరీతంగా పెరిగారు. ఒక్క రాత్రికే 25 లక్షల మంది ఫాలోవర్లు పెరిగారు. ప్రస్తుతం నీరజ్ చోప్రా ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో 2.6 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. ఆయన 160 మందిని ఫాలో అవుతున్నారు. మొత్తం 205 పోస్టులు చేశాడు. ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించాక.. గోల్డ్ మెడల్‌తో దిగిన ఫోటోలను కూడా నీరజ్.. తాజాగా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేశాడు.
How the Olympics started // How the Olympics ended pic.twitter.com/V1k6tRgQFh
— Aman Shah (@aman812) August 7, 2021
Neeraj Chopra's Instagram grew by 1.1 Million followers in the last 6 Hours. So happy for Our India's Legend Olympics Gold Medalist.
— THE REAL CRIC INFO (@RohanSatpati) August 7, 2021