Viral Video | కదులుతున్న రైలు నుంచి పడిపోబోయిన తల్లీబిడ్డను కాపాడిన పోలీసులు..
Viral Video | కదులుతున్న రైలు కింద పడిపోబోయిన ఓ చిన్నారిని రైల్వే పోలీసులు కాపాడారు. ఈ ఘటన ముంబయిలోని మన్‌కుర్ద్ రైల్వే స్టేషన్లో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..
Viral Video | కదులుతున్న రైలు కింద పడిపోబోయిన ఓ చిన్నారిని రైల్వే పోలీసులు కాపాడారు. ఈ ఘటన ముంబయిలోని మన్‌కుర్ద్ రైల్వే స్టేషన్లో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..
మంగళవారం మధ్యాహ్నం సమయంలో ఓ మహిళ చిన్నారిని ఎత్తుకుని రెండవ నంబర్ ప్లాట్‌ఫాంపైకి వచ్చింది. అక్కడున్న లోకల్ ట్రైన్‌ను ఎక్కింది. రద్దీ కారణంగా రైలు కదులుతున్న సమయంలో ఆమె పట్టుకోల్పోయింది. ఈ క్రమంలో మహిళ చేతిలోని చిన్నారి జారి రైలు కింద పడబోయింది. అక్కడే ఉన్న రైల్వే పోలీసు అక్షయ్ సోయ గమనించి చిన్నారి రైలు కిందపడకుండా కాపాడాడు. అనంతరం కొంత దూరం వెళ్లాకా సదరు మహిళను అక్కడే ఉన్న ఓ ప్రయాణికుడు కాపాడాడు. ఇందుకు సంబంధించిన దృష్యాలు రైల్వే స్టేషన్‌లోని సీసీటీవీలో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు అక్షయ్ సాహసాన్ని మెచ్చుకుంటున్నారు.
#MissionJeevanRaksha आज अपराध शाखाके अक्षय सोये द्वारा मानखुर्द रेलवे स्टेशनके प्लेटफार्म 2 पर लोकल ट्रेनमें महिला यात्री गोदमें छोटे बच्चेको लेकर चढ़ते समय असंतुलित होकर गिरनेपर बच्चेको पकड़कर सूझबूझसे बच्चेकी जान बचाया @RailMinIndia @RPFCR @RPF_INDIA pic.twitter.com/gBCWulYylo
— RPF Mumbai Division (@RPFCRBB) November 1, 2022
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

