విషాదంలో అద్భుతం… లారీ కింద పడి గర్భిణీ మరణించగా, జన్మించిన శిశువు
లక్నో: ఒక విషాద సంఘటనలో అద్భుతం జరిగింది. ప్రమాదవశాత్తూ లారీ కింద పడి గర్భిణీ మరణించగా, అనూహ్యంగా ఆమె కడుపులోని శిశువు బయటకు వచ్చింది. ఉత్తర ప్రదేశ్‌లోని ఫిరోజాబాద్ జిల్లాలో ఈ మిరాకిల్ సంఘటన జరిగింది. ఆగ్రాకు చెందిన 26 ఏళ్ల కామిని 8 నెలల గర్భవతి. కాన్పు కోసం భర్త రాముతో కలిసి బైక్‌పై బుధవారం తన పుట్టింటికి బయలుదేరింది. అయితే ఫిరోజాబాద్ జిల్లాలోని బర్తర గ్రామం సమీపం వద్ద ఎదురుగా కారు రావడంతో భర్త రాము తన బైక్‌పై నియంత్రణ కోల్పోయాడు. కారును ఢీకొట్టకుండా ఉండేందుకు సడెన్‌గా బ్రేక్ వేశాడు. దీంతో భర్త బైక్‌పై వెనుక కూర్చొన్న కామిని ఎగిరి రోడ్డుపై పడింది. అంతలో ఒక లారీ వేగంగా ఆమె మీదుగా వెళ్లింది.
మరోవైపు రోడ్డు ప్రమాదంలో కామిని మరణించగా మిరాకిల్‌గా బిడ్డకు జన్మనిచ్చింది. లారీ తొక్కేయడంతో కామిని శరీరం నుజ్జు అయ్యింది. అయితే ఆమె కడుపు నుంచి ఆడ శిశువు సురక్షితంగా బయటపడింది. ఆ శిశివును వెంటనే ఫిరోజాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. పాప ఆరోగ్యంగానే ఉన్నదని, ప్రాథమిక చికిత్స మాత్రమే అవసరమైందని వైద్యులు తెలిపారు.
కాగా, కామిని భర్త రాము కూడా ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డాడు. అతడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం అనంతరం ఆగకుండా వెళ్లిపోయిన లారీని సీసీటీవీ ఫుటేజ్ ద్వారా గుర్తించి డ్రైవర్‌ను అరెస్ట్ చేస్తామని పోలీస్ అధికారి తెలిపారు.
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road accident | గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. రైలింగ్‌ను ఢీకొట్టిన కారు, ఐదుగురికి గాయాలు
BJP MLA: బాణాసంచా పేల్చితే.. అనేక వ్యాధులు దూరం : బీజేపీ ఎమ్మెల్యే
Yadagirigutta | యాదగిరిగుట్టలో వైభవంగా స్వాతి నక్షత్ర వేడుకలు
AK 47 Collections | భారీ నష్టాల దిశగా వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’.. 10 రోజుల కలెక్షన్లు ఎంతంటే?
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. 4 రోజుల్లోనే రూ.500 కోట్లకు చేరువలో వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

