Mahindra SUV | షాకింగ్ వీడియో.. మహీంద్రా ఎస్యూవీ సన్‌రూఫ్ నుంచి లీకవుతున్న వాటర్..!
Mahindra SUV | మహీంద్రా పాపులర్ ఎస్యూవీ (స్కార్పియో) (Mahindra Scorpio SUV) వాహన వినియోగదారుడికి ఊహించని షాక్ తగిలింది. కారు సన్‌రూఫ్ (Sunroof) నుంచి వాటర్ లీకైంది (water leaked).
Mahindra SUV | మహీంద్రా పాపులర్ ఎస్యూవీ (స్కార్పియో) (Mahindra Scorpio SUV) వాహన వినియోగదారుడికి ఊహించని షాక్ తగిలింది. కారు సన్‌రూఫ్ (Sunroof) నుంచి వాటర్ లీకైంది (water leaked). ఊహించని ఈ ఘటనతో అతను ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో (Video) ప్రస్తుతం సోషల్ మీడియా (Social media)లో వైరల్ అవుతోంది.
అరుణ్ పన్వార్ (Arun Panwar) అనే వ్యక్తి.. కొండ ప్రాంతంలో (hill Area) ప్రయాణిస్తున్నాడు. ఆ సమయంలో అక్కడ కొండపై నుంచి జాలువారుతున్న ఓ చిన్న జలపాతాన్ని (waterfall) చూసి.. ఆ జలపాతం కింత తన కారును శుభ్రం చేయాలని అనుకుంటాడు. దీంతో ముందుగా సన్‌రూఫ్‌ను (Sunroof) క్లోజ్ చేసి కారును జలపాతం కిందకు తీసుకెళ్తాడు. అంతే ఇక సన్‌రూఫ్ (Sunroof) , స్పీకర్స్ (speakers) ద్వారా నీరంతా కారు క్యాబిన్లోకి ప్రవేశిస్తుంది. ఊహించని ఈ ఘటనతో అతను ఒక్కసారిగా షాక్ అవుతాడు. వెంటనే తన కారును జలపాతం కింద నుంచి పక్కకు తీస్తాడు. సన్‌రూఫ్ (Sunroof) మూసి ఉందోలేదో మరోసారి చెక్ చేసుకుంటాడు. అయితే అప్పటికే నీరు మొత్తం కారులోకి ప్రవేశించి.. ముందు సీటు మొత్తం తడిచిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇది చూసిన నెటిజన్లు బిన్నంగా స్పందిస్తున్నారు. ‘నా జీప్ మెరిడియన్ని ( jeep meridian) చాలాసార్లు ఇలా కడిగాను. కానీ నాకు ఎప్పుడూ ఇలాంటి ఘటన ఎదురుకాలేదు’ అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. ‘అందుకే నేను మహేంద్రా కార్లు (Mahindra cars) కొనను.. నేను నా సైకిల్ (cycle)తోనే చాలా సంతృప్తిగా ఉన్నా’ అంటూ మరో నెటిజన్ అన్నాడు. కారును జలపాతంకిందకు తీసుకెళ్లిన సమయంలో కారులోని ముందు సీటు కవర్‌తో కప్పబడి ఉండటంతో నెటిజన్లు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా సదరు వ్యక్తి సన్ రూఫ్‌ను కొద్దిగా తెరిచి ఉంచాడని భావిస్తున్నట్లు కామెంట్లు చేస్తున్నారు.
Also Read..
Mrunal Thakur | మృణాల్‌కు పెళ్లి ప్రపోజల్ పెట్టిన నెటిజన్.. నటి రిప్లై ఏంటో తెలుసా..?
Air India | మరో వివాదంలో ఎయిర్ ఇండియా.. ఫుడ్‌లో పురుగు వచ్చిందంటూ ప్రయాణికుడి ట్వీట్..!
Food Menu Card | కుచ్ నై- రూ. 220, కుచ్ బీ-రూ. 240.. ఫన్నీ మెనూ కార్డ్..!
TikTok | కెనడాలో టిక్‌టాక్‌పై నిషేధం.. ప్రకటించిన ప్రభుత్వం..!
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

