Mrunal Thakur | సీతారామం (Sita Ramam) సినిమాతో టాలీవుడ్ (Tollywood)లో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది మరాఠీ భామ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur). ఆ చిత్రంలో సీత పాత్రలో అందర్నీ ఆకట్టుకుంది. ఈ ఒక్క సినిమా తెచ్చిన పాపులారిటీతో ఇప్పుడు ఈమెకు వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. సినిమాలే కాదు మృణాల్ సోషల్ మీడియా (Socialmedia)లోనూ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఆమెకు సోషల్ మీడియాలో లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు. ఇక మృణాల్ తన గురించి ఎప్పటికప్పుడు నెటిజన్లకు అప్డేట్ ఇస్తూ.. కొత్త కొత్త ఫొటోలను పంచుకుంటూ ఉంటుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను పోస్ట్ చేసింది.
తమిళ చిత్రం ‘పచ్చైకిలి ముత్తుచరమ్’ (Pachaikili Muthucharam)లోని ‘ఉన్నకుల్..’ (Unnakul Naane) అనే పాటను బ్యాక్‌గ్రౌండ్‌లో ప్లే అయ్యేలా ఎడిట్ చేసిన వీడియోను షేర్ చేసింది. ఇది చూసిన ఓ నెటిజన్ ఆమెకు పెళ్లి ప్రపోజల్ (marriage proposal) పెట్టాడు. ‘మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి నా వైపు నుంచి ఓకే’ అని కామెంట్ చేశాడు. దీనికి మృణాల్ చాలా కూల్‌గా, ఫన్నీగా సమాధానమిచ్చింది. ‘నా వైపు నుంచి ఓకే కాదుగా..’ అంటూ నవ్వుతున్న ఎమోజీని పోస్ట్ చేసింది. ప్రస్తుతం వీరిద్దరి మధ్య జరిగిన ప్రపోజల్ సంభాషణ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
Also Read..
Air India | మరో వివాదంలో ఎయిర్ ఇండియా.. ఫుడ్‌లో పురుగు వచ్చిందంటూ ప్రయాణికుడి ట్వీట్..!
Food Menu Card | కుచ్ నై- రూ. 220, కుచ్ బీ-రూ. 240.. ఫన్నీ మెనూ కార్డ్..!
TikTok | కెనడాలో టిక్‌టాక్‌పై నిషేధం.. ప్రకటించిన ప్రభుత్వం..!
Lionel Messi | మెస్సీని వరించిన బెస్ట్ మెన్స్ ప్లేయర్ అవార్డు