Lionel Messi | అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ (Lionel Messi)కి బెస్ట్ మెన్స్ ప్లేయర్ కిరీటం (Best Mens Player Award) వరించింది. పారిస్ ( Paris ) వేదికగా ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ది ఫుట్‌బాల్ అసోసియేషన్ (FIFA) నిర్వహించిన బెస్ట్ ఫిఫా ఫుట్‌బాల్ అవార్డ్స్‌లో మెస్సీ ఈ అవార్డును అందుకున్నారు. గతేడాది డిసెంబర్లో జరిగిన ఫిఫా వరల్డ్ కప్ (FIFA World Cup) లో తన అద్భుత ఆటతీరుతో అర్జెంటీనా (Argentina)ను మెస్సీ విశ్వవిజేతగా నలిపిన విషయం తెలిసిందే.
ఆ గెలుపుతో 36 ఏండ్ల అర్జెంటీనా (Argentina) అభిమానుల నిరీక్షణకు తెరదింపిన మెస్సీ.. వరల్డ్‌కప్ అందుకోవాలన్న తన చిరకాల కోరికను కూడా నెరవేర్చుకున్నాడు. ఈ సందర్భంగా మెస్సీ మాట్లాడుతూ.. ఫిఫా అవార్డు అందుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ‘బెస్ట్ మెన్స్ ప్లేయర్‌గా(Best Mens Player 2022) ఎంపికవడం వల్ల 2022వ సంవత్సరం నాకు అద్భుతమైనదిగా నిలిచింది. ఈ అవార్డును గెలుచుకోవడం చాలా గర్వంగా ఉంది’ అని అన్నారు.
మెస్సీ కెప్టెన్సీలోని అర్జెంటీనా ఖతర్‌లో జరిగిన ఫిఫా వరల్డ్ కప్ ఛాంపియన్‌గా అవతరించింది. మూడోసారి వరల్డ్ కప్ గెలిచిన జట్టుగానూ రికార్డు క్రియేట్ చేసింది. ఉత్కంఠ పోరులో షూటౌట్లో 4-2తో ఫ్రాన్స్‌ను ఓడించింది. మెస్సీ రెండు గోల్స్ కొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. వరల్డ్ కప్ ట్రోఫీని ముద్దాడాలన్న తన 8 ఏళ్ల కలను ఈ స్టార్ ప్లేయర్ నిజం చేసుకున్నాడు. 2014లో మెస్సీ అర్జెంటీనాను ఫైనల్ చేర్చాడు. కానీ, ఫైనల్లో జర్మనీ కప్పు ఎగరేసుకుపోయింది.
Another prize for Lionel Messi 🏆#TheBest pic.twitter.com/7kUaRRebBy
— FIFA World Cup (@FIFAWorldCup) February 27, 2023
#TheBest of #TheBest 🏆 pic.twitter.com/U2ZxPq2aux
— FIFA World Cup (@FIFAWorldCup) February 27, 2023
Also Read..
‘పరుగులు చేయకుంటే విమర్శలు తప్పవు’
Shardul Thakur – Mittali Parulkar | వివాహ బంధంలోకి శార్దూల్ ఠాకూర్ – మిథాలీ.. ఫొటోలు వైరల్
WPL | వరల్డ్ కప్ విజేతకు గుజరాత్ జెయింట్స్ కెప్టెన్సీ