Shardul Thakur – Mittali Parulkar | వివాహ బంధంలోకి శార్దూల్ ఠాకూర్ – మిథాలీ.. ఫొటోలు వైరల్
టీమిండియా ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ కూడా ఈరోజు వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. కొంత కాలంగా ప్రేమలో ఉన్నమితాలీ పారుల్కర్‌ను పెళ్లి చేసుకున్నాడు. వీళ్ల వివాహం ముంబైలో కుటుంబసభ్యులు, అతిథుల సమక్షంలో వైభవంగా జరిగింది. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌కు ఎంపిక కాని శార్దూల్ వన్డే జట్టుతో కలవనున్నాడు.
Shardul Thakur – Mittali Parulkar : టీమిండియా ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ కూడా ఈరోజు వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. కొంత కాలంగా ప్రేమలో ఉన్నమితాలీ పారుల్కర్‌ను పెళ్లి చేసుకున్నాడు. వీళ్ల వివాహం ముంబైలో కుటుంబసభ్యులు, అతిథుల సమక్షంలో వైభవంగా జరిగింది. సంప్రదాయ పద్థతిలో మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు. శార్దూల్ – మితాలీ పెళ్లికొడుకు, పెళ్లి కూతురు దుస్తుల్లో ఉన్న ఫొటోలు ఆన్లైన్లో వైరల్ అవుతున్నాయి.
శార్దూల్ ప్రీ-వెడ్డింగ్ డాన్స్ వీడియో ఆన్లైన్లో వైరల్ అయింది. ఆ వీడియోలో భారత ఆటగాడు, కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ‘తుమ్ జో మెరా సాత్ దో’ బాలీవుడ్ పాట పాడుతుంటే శార్దూల్ కూడా గొంతు కలిపాడు. ఆ తర్వాత మితాలీతో కలిసి స్టెప్పులు వేశాడు. ఆదివారం జరిగిన సంగీత్ వేడుకకు కెప్టెన్ రోహిత్ శర్మ, భార్య రితికాతో కలిసి వెళ్లాడు. రెండు రోజుల క్రితం అతని హల్దీ వేడుక ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్ అయ్యాయి. శ్రేయాస్ అయ్యర్‌తో పాటు స్పిన్నర్ యజువేంద్ర చాహల్ అతని భార్య ధనశ్రీ వర్మ పాల్గొన్నారు.
2021 నవంబర్‌లో..
మిథాలీ పారుల్కర్.. స్వగ్రామం మహారాష్ట్రలోని కొల్హాపూర్. మిథీబాయి కాలేజీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఆంత్రోప్రెన్యూర్ అయిన మితాలీ ఆల్ ది జాజ్ లక్జరీ బేకర్స్ అనే కంపెనీ నడుపుతోంది. ఈ ఇద్దరికి 2021 నవంబర్‌లో ఎంగేజ్మెంట్ జరిగింది. క్రికెట్ షెడ్యూల్‌తో శార్దూల్ బిజీగా ఉండడంతో పెళ్లి ముహూర్తం కోసం రెండేళ్లు ఆగాల్సి వచ్చింది. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌కు ఎంపిక కాని శార్దూల్ వన్డే జట్టుతో కలవనున్నాడు.
కేకేఆర్ తరఫున
ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్లో) ఈ ఆల్‌రౌండర్ కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ఆడనున్నాడు. గత సీజన్ వేలంలో అతడిని ఢిల్లీ క్యాపిటల్స్ రూ.10.75 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసిది. అయితే.. అతను దారుణంగా విఫలం అయ్యాడు. దాంతో అతడిని డీసీ ట్రేడ్ పద్థతిలో కేకేఆర్‌కు అప్పగించింది. పదహారో సీజన్ ఐపీఎల్ మార్చి 31న ప్రారంభం కానుంది. ప్రతి ఫ్రాంఛైజీ సొంత గ్రౌండ్లో ఏడు మ్యాచ్‌లు ఆడనుంది. భారత క్రికెట్లో ప్రస్తుతం పెళ్లి సీజన్ నడుస్తోంది. ఈ ఏడాది ఓపెనర్ కేఎల్ రాహుల్, ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ పెళ్లి పీటలెక్కిన విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి
WPL | వరల్డ్ కప్ విజేతకు గుజరాత్ జెయింట్స్ కెప్టెన్సీ
Rajkumar Sharma | అందరూ విమర్శిస్తుంటే.. అతనొక్కడే కోహ్లీకి మద్దతుగా నిలిచాడు : విరాట్ చిన్నప్పటి కోచ్
Border – Gavaskar Trophy | ఆస్ట్రేలియాతో మూడో టెస్టు.. నెట్స్‌లో చెమటోడ్చిన కోహ్లీ, రాహుల్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

