TikTok | కెనడాలో టిక్‌టాక్‌పై నిషేధం.. ప్రకటించిన ప్రభుత్వం..!
TikTok | చైనా (China) కంపెనీకి చెందిన ప్రముఖ వీడియో షేరింగ్ యాప్ (Video Sharing App) టిక్‌టాక్ (TikTok)కు మరో దేశం షాక్ ఇచ్చింది. ఈ యాప్‌ను నిషేధిస్తున్నట్లు (Bans) కెనడా (Canada) ప్రభుత్వం తాజాగా ప్రకటించింది.
TikTok | చైనా (China) కంపెనీకి చెందిన ప్రముఖ వీడియో షేరింగ్ యాప్ (Video Sharing App) టిక్‌టాక్ (TikTok)కు మరో దేశం షాక్ ఇచ్చింది. ఈ యాప్‌ను నిషేధిస్తున్నట్లు (Bans) కెనడా (Canada) ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
గోప్యత, భద్రత పరంగా ఇది ప్రమాదకరమని పేర్కొంది. అంతర్జాతీయ భాగస్వాముల సూచనలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఇకపై తమ దేశంలో టిక్‌టాక్ (TikTok)పై నిషేధం ఉంటుందని స్పష్టం చేసింది. అన్ని మొబైల్స్, ఇతర డివైజెస్ నుంచి దీన్ని తొలగించాలని సూచించింది. కెనడా వాసుల (Canadians) ఆన్ లైన్ భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని ఈ సందర్భంగా ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో (Justin Trudeau) ప్రకటించారు. టిక్ టాక్ (TikTok)పై నిషేధం ఈ దిశగా తీసుకున్న చర్యల్లో ఒకటని తెలిపారు.
కాగా, చైనా (China)కు చెందిన బైట్ డ్యాన్స్ (Bytedance) కంపెనీ టిక్ టాక్ (TikTok) మాతృ సంస్థగా ఉంది. ఆ సంస్థ చైనా ప్రభుత్వ పర్యవేక్షణలో నడిచే కంపెనీ కావడం, యూజర్ల డేటాపై కంపెనీకి నియంత్రణ ఉండడంతో ప్రపంచవ్యాప్తంగా టిక్ టాక్‌పై పలు దేశాల్లో ఆందోళనలు నెలకొన్నాయి. కానీ, అవి ధైర్యంగా నిషేధ నిర్ణయం తీసుకోలేకపోతున్నాయి. అయితే కొన్ని దేశాలు ఇప్పటికే టిక్‌టాక్‌ను నిషేధించాయి కూడా. 2020 లో భారత్ టిక్‌టాక్‌పై నిషేధం విధించింది. గల్వాన్ లోయ దాడి తర్వాత భారత్.. టిక్‌టాక్ సహా వందలాది చైనా యాప్‌లను నిషేధించింది.
అనంతరం మరికొన్ని దేశాలు సైతం టిక్‌టాక్‌ను నిషేధించాయి. గతేడాది చివర్లో అగ్రరాజ్యం అమెరికా సైతం టిక్టాన్ను బ్యాన్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. చైనాకు చెందిన ఈ యాప్‌ను తమ చట్టసభల డివైజ్‌ల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. దేశం మొత్తం కాకుండా కేవలం అమెరికా ప్రభుత్వ డివైజ్‌లలో మాత్రమే వినియోగించకూడదని పేర్కొంది. భద్రతా కారణాల దృష్ట్యా ఇకపై చట్టసభల సిబ్బంది హౌస్ డివైజెస్‌లో టిక్‌టాక్‌ను వాడకూడదని ఆదేశించింది. తాజాగా కెనడా ప్రభుత్వం సైతం ఈ యాప్‌ను నిషేధించడంతో చైనా కంపెనీకి పెద్ద షాక్ ఇచ్చినట్లైంది.
Also Read..
Elon Musk | రాణించిన టెస్లా షేర్లు.. ప్రపంచ కుబేరుల జాబితాలో తొలిస్థానానికి చేరిన ఎలాన్ మస్క్
Heart transplantation | 13 నెలల పాపకు పునర్జన్మ.. రెండేండ్ల బాలుడి గుండె అమరిక
Lionel Messi | మెస్సీని వరించిన బెస్ట్ మెన్స్ ప్లేయర్ అవార్డు
Stray Dogs | కుక్కలు కరవడానికి వస్తే ఇలా తప్పించుకోండి
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NBK 112 | మ్యూజిక్ డైరెక్టర్‌పై క్లారిటీ.. అనిరుధ్, జీవీ ప్రకాష్‌లకు నో ఛాన్స్, బాలయ్య సినిమా అప్డేట్ ఇదే!
TN CM Vijay | జైలు నుంచి ఖైదీల పరారీ ఘటన.. తమిళనాడు సీఎం విజయ్ కీలక ఆదేశాలు..!
AP News | ఏపీలో దారుణం.. తరగతి గదిలో విద్యార్థినిపై ఎలక్ట్రిక్ రంపంతో నిందితుడి దాడి.. పరిస్థితి విషమం
Sanjeev Arora: జైలులో సంజీవ్ అరోరా.. లుథియానా వెస్ట్ సీటు కేటాయింపు
నల్లగొండలో ఎలక్ట్రిక్ బస్ డ్రైవర్ల నిరసన
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

