Heart transplantation | 13 నెలల పాపకు పునర్జన్మ.. రెండేండ్ల బాలుడి గుండె అమరిక
Heart transplantation | అనారోగ్యంతో ఉన్న 13 నెలల పాపకు, బ్రెయిన్‌డెడ్ (Brain dead) అయిన రెండేండ్ల బాలుడి గుండె (Heart)ను వైద్యులు విజయవంతంగా అమర్చారు. ఈ ఘటన తిరుపతి (Tirupati)లోని పద్మావతి హృదయాలయం (Padmavathi Hrudayalaya)లో చోటు చేసుకుంది.
Heart transplantation | అనారోగ్యంతో ఉన్న 13 నెలల పాపకు, బ్రెయిన్‌డెడ్ (Brain dead) అయిన రెండేండ్ల బాలుడి గుండె (Heart)ను వైద్యులు విజయవంతంగా అమర్చారు. ఈ ఘటన తిరుపతి (Tirupati)లోని పద్మావతి హృదయాలయం (Padmavathi Hrudayalaya)లో చోటు చేసుకుంది. గుంటూరు (Guntur) జిల్లా మాచర్ల (Macherla)కు చెందిన 13 నెలల చిన్నారి అనారోగ్యానికి గురవడంతో మూడు నెలల క్రితం ఆస్పత్రికి తీసుకొచ్చారు. చిన్నారిని పరీక్షించిన వైద్యులు గుండె దెబ్బతిన్నట్లు గుర్తించి.. గుండె మార్పిడి చేయాలని సూచించారు. ఈ మేరకు జీవన్ దాన్ (Jeevandan)లో పాప వివరాలను నమోదు చేశారు.
ఈ క్రమంలో చెన్నై (Chennai)లోని ఎంజీఎం ఆసుపత్రి (MGM Hospital)లో బ్రెయిన్ డెడ్ (Brain dead)కు గురైన రెండేండ్ల బాలుడి గుండె దానం చేస్తారనే విషయం పద్మావతి ఆస్పత్రి డైరెక్టర్ శ్రీనాథరెడ్డి దృష్టికి వచ్చింది. దీంతో ఆయన గుండె చికిత్సల నిపుణుడు డాక్టర్ గణపతి బృందంతో చర్చించి ఆ బాలుడి గుండెను 13 నెలల పాపకు అమర్చాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని చిన్నారి తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లడంతో వారు పాపను ఆదివారం రాత్రి ఆసుపత్రికి తీసుకొచ్చారు.
టీటీడీ సహకారంతో ప్రత్యేక అంబులెన్స్, మరో ప్రత్యేక వాహనం ఏర్పాటు చేసుకొని వైద్య బృందం ఆదివారం రాత్రే చెన్నై చేరుకుంది. గ్రీన్ చానల్ అవసరం లేకుండా కేవలం 2గంటల 15 నిమిషాల్లో గుండెను తిరుపతిలోని ఆస్పత్రికి తీసుకొచ్చారు. సోమవారం తెల్లవారుజామున 3గంటల ప్రాంతంలో గుండె చేరుకోవడంతో డాక్టర్ శ్రీనాథ్‌రెడ్డి, డాక్టర్ గణపతి నేతృత్వంలోని బృందం.. ఉదయం 4:30 గంటలకు శస్త్రచికిత్స ప్రారంభించి 9:40 గంటలకు విజయవంతంగా పూర్తి చేసి చిన్నారికి పునర్జనమ్మను అందించారు.
Also Read..
Gold Mines | ఒడిశాలోని మూడు జిల్లాల్లో బంగారు గనులు.. గుర్తించిన జీఎస్ఐ
SSC Exam Preparation | టెన్త్ పరీక్షలకు మిగిలింది 34 రోజులే.. ఇలా ప్రీపేర్ అవ్వండి
Lionel Messi | మెస్సీని వరించిన బెస్ట్ మెన్స్ ప్లేయర్ అవార్డు
Elon Musk | రాణించిన టెస్లా షేర్లు.. ప్రపంచ కుబేరుల జాబితాలో తొలిస్థానానికి చేరిన ఎలాన్ మస్క్
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

