Elon Musk | రాణించిన టెస్లా షేర్లు.. ప్రపంచ కుబేరుల జాబితాలో తొలిస్థానానికి చేరిన ఎలాన్ మస్క్
Elon Musk | ప్రపంచ కుబేరుల (Worlds Richest Person) జాబితాలో తిరిగి తొలిస్థానానికి చేరుకున్నారు అపర కుబేరుడు, టెస్లా (Tesla ) అధినేత, ట్విట్టర్ (Twitter) కొత్త బాస్ ఎలాన్ మస్క్ (Elon Musk). గత ఏడాది అధిక నష్టాల కారణంగా మస్క్ ప్రపంచ బిలియనీర్ల జాబితాలో రెండో స్థానానికి పడిపోయిన విషయం తెలిసిందే. టెస్లా షేర్లు (Tesla Shares) రాణించడంతో ఆయన మళ్లీ తొలిస్థానానికి చేరుకున్నారు.
Elon Musk | ప్రపంచ కుబేరుల (Worlds Richest Person) జాబితాలో తిరిగి తొలిస్థానానికి చేరుకున్నారు అపర కుబేరుడు, టెస్లా (Tesla ) అధినేత, ట్విట్టర్ (Twitter) కొత్త బాస్ ఎలాన్ మస్క్ (Elon Musk). గత ఏడాది అధిక నష్టాల కారణంగా మస్క్ ప్రపంచ బిలియనీర్ల జాబితాలో రెండో స్థానానికి పడిపోయిన విషయం తెలిసిందే. టెస్లా షేర్లు (Tesla Shares) రాణించడంతో ఆయన మళ్లీ తొలిస్థానానికి చేరుకున్నారు. ఈ మేరకు బ్లూమ్‌బర్గ్ (Bloomberg) నివేదించింది.
బ్లూమ్‌బర్గ్ (Bloomberg) నివేదిక ప్రకారం.. గత ఏడాది డిసెంబరులో ఎలాన్ మస్క్ (Elon Musk) సంపద 200 బలియన్ డాలర్ల మేర కరిగిపోయింది. టెస్లా షేర్లు పతనమవడంతో ఆయన తన తొలిస్థానాన్ని కోల్పోయారు. ఇక ప్రస్తుతం టెస్లా షేర్లు బలంగా పుంజుకోవడంతో తొలిస్థానాన్ని కోల్పోయిన రెండు నెలల్లోనే మళ్లీ తన స్థానాన్ని సొంతం చేసుకున్నారు మస్క్. టెస్లా షేర్లు ఈ ఏడాదిలో ఇప్పటి వరకు70శాతం మేర పెరిగాయి. ఫలితంగా ఏడాది మొదట్లో 137 బిలియన్ డాలర్లుగా ఉన్న ఎలాన్ మస్క్ సంపద.. ఇప్పుడు ఏకంగా 187 బిలియన్ డాలర్లకు చేరినట్లు బ్లూమ్‌బర్గ్ (Bloomberg) తన కథనంలో నివేదించింది.
ఇక ఇక ప్రపంచ కుబేరుల జాబితాలో (Worlds Richest Persons List) మస్క్ (Musk) తర్వాత బెర్నార్డ్ ఆర్నాల్ట్ ( Bernard Arnault) 185 బిలియన్ డాలర్ల సంపదతో రెండో స్థానంలో ఉన్నారు. అమెజాన్బాస్ జెఫ్ బెజోజ్( Amazon founder Jeff Bezos ) మూడో స్థానంలో ఉండగా.. ఒరాకిల్ కో-ఫౌండర్ లారి ఎల్లిసన్ (Oracle co-founder Larry Ellison) నాలుగో స్థానం దక్కించుకున్నారు. వారెన్ బఫెట్(Warren Buffett).. 106 బిలియన్ డాలర్ల సంపదతో 5వ స్థానంలో కొనసాగుతున్నారు. ఇండియా నుంచి.. రిలయన్స్ఇండస్ట్రీస్ అధిపతి ముకేశ్అంబానీ (Mukesh Ambani).. 84.3 బిలియన్ డాలర్ల సంపదతో 8వ స్థానంలో ఉన్నారు. ఇక గౌతమ్ ఆదానీ (Gautam Adani) 37.7 బిలియన్ డాలర్ల సంపదతో 32వ స్థానంలో ఉన్నట్లు బ్లూమ్‌బర్గ్ తన నివేదికలో పేర్కొంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

