Kiss | బీజింగ్, ఫిబ్రవరి 27: ముద్దు.. ప్రేమను వ్యక్తం చేసే ఒక పద్ధతి. ఇందులో పలు రకాలు ఉన్నా అధర చుంబనం ఇద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని మరింత పెంచుతుంది. అయితే, సుదూరంలో ఉన్నవారికి కూడా అధర చుంబన అనుభూతిని అందించేలా చైనీస్ యూనివర్సిటీ విద్యార్థులు ‘రిమోట్ కిస్సింగ్ పరికరం’ తయారు చేశారు. ఇందులో పెదాలను సిలికాన్తో తయారుచేశారు. అలాగే, సెన్సర్లను అమర్చి అచ్చం ముద్దు పెట్టినప్పుడు ఎలాంటి అనుభూతి కలుగుతుందో అలాంటి ఫీల్ వచ్చేలా చేశారు. మనిషి నోటి ఆకారంలో ఉండే ఈ పరికరాన్ని పెయిరింగ్ మొబైల్ అప్లికేషన్ ద్వారా వాడాల్సి ఉంటుంది.
ఈ పరికరాన్ని వాడినప్పుడు సుదూరంలో ఉన్న వ్యక్తి మనకు ప్రత్యక్షంగా ముద్దు పెడుతున్న ఫీల్ కలుగుతుంది. దీని ధర భారత కరెన్సీలో రూ.3 వేలు. ఈ పరికరాన్ని చైనా ఈకామర్స్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. ఈ రిమోట్ కిస్సింగ్ పరికరం డెమో వీడియో సోషల్ మీడియాలో పెట్టగా వైరల్గా మారింది. ఇప్పటి వరకు 5 లక్షలకుపైగా మంది వీక్షించడం గమనార్హం.