Stray Dogs | కుక్కలు కరవడానికి వస్తే ఇలా తప్పించుకోండి
Stray Dogs | కుక్కల నుంచి ఎలా రక్షణ పొందాలి..? కరిచేందుకు వస్తే ఏం చేయాలి..? ఎలా తప్పించుకోవాలి..? ఎలా ప్రవర్తించాలి..? రేబిస్ వ్యాధి నిరోధక టీకా తీసుకోవడం.. ఇలా వివిధ అంశాలపై నగరవాసుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి.. సూచనలు, సలహాలు ఇస్తున్నారు అధికారులు. ‘జాగ్రత్తలు పాటిద్దాం.. కుక్క కాటు నివారిద్దాం’ అంటూ.. పిలుపునిస్తున్నారు.
Stray Dogs | అంబర్‌పేట లాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం, బల్దియా పట్టిషమైన చర్యలు తీసుకుంటున్నది. ఒకవైపు మూగజీవాల సంరక్షణ చేపడుతూనే.. వాటి నుంచి ప్రజలకు ఎదురయ్యే ముప్పును తప్పించేందుకు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నది. కుక్కల నుంచి ఎలా రక్షణ పొందాలి..? కరిచేందుకు వస్తే ఏం చేయాలి..? ఎలా తప్పించుకోవాలి..? ఎలా ప్రవర్తించాలి..? రేబిస్ వ్యాధి నిరోధక టీకా తీసుకోవడం.. ఇలా వివిధ అంశాలపై నగరవాసుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి.. సూచనలు, సలహాలు ఇస్తున్నారు అధికారులు. ‘జాగ్రత్తలు పాటిద్దాం.. కుక్క కాటు నివారిద్దాం’ అంటూ.. పిలుపునిస్తున్నారు.
సిటీబ్యూరో, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ): నగరవాసులకు కుక్కల బెడద నుంచి విముక్తి కావడానికి జీహెచ్ఎంసీ పటిష్టమైన చర్యలు చేపడుతోంది. అంబర్‌పేట ఘటనను దృష్టిలో పెట్టుకొని అటువంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలనే సంకల్పంతో ప్రభుత్వం, మున్సిపల్ పరిపాలన శాఖ, జీహెచ్ఎంసీ సంయుక్తంగా కుక్కల బెడద నివారణకు మార్గదర్శకాలను జారీ చేసి, కుక్కల దాడులు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగానే కుక్క కాటు నివారణకు విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నది.

ఇలా చేద్దాం..
- గొలుసు కట్టి ఉన్న లేదా ఫెన్సింగ్ లోపల ఉన్న కుక్కకు దగ్గరగా నడవకండి
- కుక్క అరుస్తూ దగ్గరగా వస్తే చెట్టులా కదలకుండా నిలబడండి. చేతులను శరీరానికి ఆనించి ఉంచండి. కుక్కను మిమ్ములను వాసన చూడనీయండి. వాసన చూసిన కుక్క సాధారణంగా నోరు తెరవకుండా వెళ్లిపోతుంది.
- ఒకవేళ కుక్క కరవడానికి దాడి చేస్తే ముడుచుకుని రాయిలా పడుకోండి. బంతిలా దగ్గరగా ముడుచుకుని ఉండండి. చేతులతో తల వెనుక పెట్టి మొహంపై కరవకుండా జాగ్రత్త పడండి.
- ఆహారం తింటున్న, నిద్రిస్తున్న, పిల్లలు ఉన్న తల్లి కుక్కలను ఆందోళనకు గురి చేస్తూ వాటి మీదకు వెళ్లకండి. ఎట్టి పరిస్థితిలోనూ కుక్కలపై రాళ్లు, కర్రలు విసరవద్దు.
- కుక్క పిల్లల దగ్గరకు వెళ్లవద్దు.. రక్షణ కోసం తల్లి కుక్క కరవవచ్చు.
- కుక్కలు దగ్గరగా ఉన్నప్పుడు వేగంగా నడవకూడదు. అలా చేస్తే అవి వెంటపడతాయి.
- కుక్కకండ్లలోకి సూటిగా చూడవద్దు. అలా చేస్తే దానిని రెచ్చగొట్టినట్లే.
- కుక్కకరిస్తే..వెంటనే ధారగా పడే నీటి కింద సబ్బుతో పది నిమిషాలు గట్టిగా ఒత్తి కడగాలి. దగ్గరలోని దవాఖానకు వెళ్లి వైద్యుని సంప్రదించండి.
- రేబిస్ వ్యాధి నిరోధక టీకాలు తప్పనిసరిగా తీసుకోవాలి.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Samantha | తొమ్మిదో నెలలోనూ సమంత వర్కౌట్స్.. ‘ఫైనల్ ల్యాప్’ అంటూ ఆసక్తికర పోస్ట్!
Health tips | రాత్రి ధనియాలను నానబెట్టి ఉదయాన్నే ఆ నీళ్లు తాగితే ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా..?
Supreme Court | విభేదాలొచ్చాయని ఆ బంధాన్ని అత్యాచారంగా పరిగణించలేం : సుప్రీంకోర్టు
Double Bedroom Homes | పేదలకు అందని డబుల్ బెడ్ రూం ఇళ్లు.. ఎమ్మెల్యే అనుచరులు, కాంగ్రెస్ కార్యకర్తలకే..!
Chinese Food | చైనీస్ ఫుడ్ వండేటప్పుడు పాత్రలపై మంటలు వస్తాయి.. ఎందుకని..?
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

