వైరల్ వీడియో : ట్రైన్ దూసుకొస్తుండగా రైల్వే ట్రాక్స్‌పై తిరుగుతున్న శునకాన్ని కాపాడాడు
ఓ లోకల్ ట్రైన్ స్టేషన్లోకి వస్తుండగా రైల్వే ట్రాక్స్‌పై తిరుగుతున్న కుక్కను కాపాడి వేగంగా ప్లాట్‌ఫాం పైకి తీసుకువచ్చిన వ్యక్తి వీడియో ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది.
ముంబై : ఓ లోకల్ ట్రైన్ స్టేషన్లోకి వస్తుండగా రైల్వే ట్రాక్స్‌పై తిరుగుతున్న కుక్కను కాపాడి వేగంగా ప్లాట్‌ఫాం పైకి తీసుకువచ్చిన వ్యక్తి వీడియో ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది. ముంబైలో ఈ ఘటనకు సంబంధించిన షార్ట్ క్లిప్‌ను ముంబై మేరి జాన్ అనే యూజర్ ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేశారు. ఈ వీడియోను ఇప్పటివరకూ 1.87 లక్షల మంది వీక్షించారు. ముంబైలోని ఏ స్టేషన్లో ఈ వీడియో రికార్డు చేశారనే వివరాలు వెల్లడి కాలేదు.
లోకల్ ట్రైన్ స్టేషన్లోకి వస్తుండగా పెద్దసంఖ్యలో ప్రయాణీకులు వేచిఉన్నారు. ఈ సమయంలో రైలు పట్టాలపై వీధి కుక్క తిరగడం గమనించిన ఓ వ్యక్తి ట్రాక్స్‌పైకి దూకి కుక్కను పట్టుకుని ప్లాట్‌ఫాంపై వేచిఉన్న ప్రయాణీకులకు అందించాడు. ఆపై ఆ వ్యక్తిని ప్రయాణీకులు ప్లాట్‌ఫాం పైకి లాగడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఇది ముంబై…ఈ వ్యక్తికి గౌరవం ఇవ్వండని పోస్ట్‌కు క్యాప్షన్‌గా ఇచ్చారు. సోషల్ మీడియాలో ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది.
Read Today's Latest Trending News in Telugu and Telugu News
- Tags
- Dog
- MAN
- Railway track
- rescues
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. లాంఛనంగా ప్రారంభించిన ఆర్మీ
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

