బిగ్బాస్ ఫేం, హర్యాన్వీ డ్యాన్సర్ సప్నాచౌదరికి సోషల్మీడియాలో ఉన్న క్రేజ్ తెలిసిందే. ఆమెకు ఇన్స్టాలో 4.8 మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నారు. ఆమె డ్యాన్స్ షోకు పెద్ద సంఖ్యలో జనం తరలివస్తారు. ఆమె డ్యాన్స్ చేస్తుంటే సీట్లలో జనాలు కూర్చోరంటే అతిశయోక్తి కాదు. కాగా, ఇటీవల జరిగిన ఒక షోలో ఓ వృద్ధుడు సప్నా చౌదరి డ్యాన్స్ చేస్తుండగా స్టేజీపైకి వచ్చాడు. అదిరిపోయే స్టెప్పులతో ఇరగదీశాడు. ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది.
ఈ వీడియోను కమెడియన్, యాక్టర్ సునీల్ గ్రోవర్ రెండురోజుల క్రితం పోస్ట్ చేయగా, వైరల్ అయ్యింది. ఇప్పటివరకూ 1.07 మిలియన్స్ మంది చూశారు. సప్పాచౌదరి హిట్ సాంగ్ అయిన ‘తేరీ ఆఖ్యా కా యో కాజల్ పాట’పై ఆమె స్టేజిపై డ్యాన్స్ చేస్తుండగా ఓ వృద్ధుడు స్టేజీపైకి ఎంటర్ అయ్యాడు. ఎనర్జీ ఫర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అతడి ఎనర్జీని స్టేజీపైనున్న ఏ ఒక్కరూ అందుకోలేకపోయారు. చప్పట్లు, విజిళ్లతో ఆ ప్రాంగణం మార్మోగిపోయింది.