Viral video: గూగుల్ ఉద్యోగం వచ్చిన సంతోషంలో తల్లి, భార్యను ఇలా ఆశ్చర్యపరిచాడు
కలల జాబ్ కోసం పట్టుదలగా ప్రయత్నించాలను అంటున్న కేరళ వ్యక్తి
గూగుల్ లాంటి పెద్ద కంపెనీలో ఉద్యోగం సాధించాలని చాలామంది లక్ష్యంగా పెట్టుకుంటారు. కేరళకు చెందిన అద్విన్ రాయ్ నెట్టో కూడా గూగుల్‌లో జాబ్ చేయాలని అనుకున్నాడు. అందుకోసం చాలాసార్లు ప్రయత్నించాడు. ఎనిమిదేళ్ల తర్వాత అద్విన్ కల నిజమైంది. ఈమధ్యే గూగుల్‌లో ప్రొడక్ట్ డిజైనర్‌గా జాబ్ తెచ్చుకున్నాడు. ఉద్యోగం సాధించిన విషయాన్నిఅతను తన తల్లి, భార్యతో పంచుకున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం ఆన్లైన్లో వైరల్ అవుతోంది.
వీడియోలో అద్విన్ పెంపుడు కుక్కని పట్టుకున్నవాళ్ల అమ్మ దగ్గరకు వెళ్తాడు. ‘ఎందుకు నవ్వుతున్నావ్? అని ఆమె అడుగుతుంది. అతని భార్య ‘గూగుల్ ఉద్యోగం వచ్చిందా?’ అని ఆశ్చర్యంగా అంటుంది. అద్విన్ రాయ్ ‘అవును’ అని చెప్పడంతో అతని తల్లి సంతోషంతో డాన్స్ చేస్తుంది. అద్విన్ భార్య అతడిని కౌగిలించుకొని శుభాకాంక్షలు తెలియజేస్తుంది. అద్విన్ ఇన్‌స్టాలో పెట్టిన ఈ వీడియోను 90 వేల మందికి పైగా చూశారు.
‘నేను 2013 నుంచి గూగుల్‌లో జాబ్ కోసం ప్రయత్నిస్తున్నాను. ప్రతి ఏడాది దరఖాస్తు చేస్తున్నాను.అయితే పేరున్న కాలేజీలో డిగ్రీ చేయకపోవడం కూడా నాకు జాబ్ రాకపోవడానికి ఒక కారణం అని తెలుసుకున్నా. ప్రొడక్ట్ డిజైనింగ్ మీద పట్టు సాధించాను. ఈసారి ఇంటర్వ్యూలో గట్టెక్కి, జాబ్ తెచ్చుకున్నాను. పట్టుదలతో ప్రయత్నిస్తే పెద్ద కంపెనీల్లో జాబ్ తెచ్చుకోవచ్చు అనడానికి నేనే ఉదాహరణ ‘ అని అద్విన్ చెప్పాడు.
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Supreme Court | విభేదాలొచ్చాయని ఆ బంధాన్ని అత్యాచారంగా పరిగణించలేం : సుప్రీంకోర్టు
Double Bedroom Homes | పేదలకు అందని డబుల్ బెడ్ రూం ఇళ్లు.. ఎమ్మెల్యే అనుచరులు, కాంగ్రెస్ కార్యకర్తలకే..!
Chinese Food | చైనీస్ ఫుడ్ వండేటప్పుడు పాత్రలపై మంటలు వస్తాయి.. ఎందుకని..?
Vatsala Rajagopal | ఇండస్ట్రీలో విషాదం.. సీనియర్ నటి వత్సలా రాజగోపాల్ కన్నుమూత!
Kranthi Kiran | కరువు మండలాలుగా ప్రకటించి, రైతులను ఆదుకోవాలి : మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

