Viral Video | సైకిల్‌పై వెళ్తున్న ఓ బాలుడు ప్రమాదవశాత్తు మోటారు సైకిల్ ఢీకొట్టి రోడ్డుపై ఎగిరిపడ్డాడు. అదే సమయంలో అటుగా బస్సు వచ్చినా తప్పించుకొని ఎలాంటి గాయాలు లేకుండా ప్రాణాలతో బయపడ్డాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన కేరళలో ఈ నెల 20న చోటు చేసుకున్నది. కన్నూర్‌లోని తాళిపరంబ సమీపంలో చోరుక్కల వద్ద ఆదివారం సాయంత్రం జరిగింది. ఓ బాలుడు సైకిల్ తొక్కుతూ వేగంగా వచ్చి రోడ్డుపైకి చేరాడు.
సైకిల్ అదుపు తప్పడంతో రోడ్డుపై వెళ్తున్న బైక్ వెనుక భాగంలో ఢీకొట్టాడు. సైకిల్ రోడ్డుపైనే పడగా.. బాలుడు దొర్లుకుంటూ రోడ్డు చివర వరకు వెళ్లాడు. కొద్ది క్షణాల్లో బస్సు రాగా.. సైకిల్ దాని కిందపడి నుజ్జునుజ్జయ్యింది. రెప్పపాటులో బాలుడు రోడ్డు చివరకు వెళ్లడంతో ప్రాణాలతో బయటపడ్డారు. ఘటనలో సైకిల్ దెబ్బతిన్నా.. బాలుడు ఎలాంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయపడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.