Curtis Campher : అంతర్జాతీయ క్రికెట్లో హ్యాట్రిక్ వీరులు.. వరుసగా నాలుగు వికెట్లు తీసిన బౌలర్లను చూశాం. కానీ, వరుసగా ఐదు బంతుల్లో ఐదు వికెట్లు అంటే అది అద్భుతమే కాదు క్రికెట్లో సరికొత్త రికార్డు. ఐర్లాండ్‌కు చెందిన కర్టిస్ కాంఫర్ (Curtis Campher) ఈ ఘనత సాధించిన మొదటి బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. గురువారం జరిగిన ఇంటర్ ప్రావిన్స్ టీ20 ట్రోఫీ (Inter-Provincial T20 Trophy) మ్యాచ్‌లో కాంఫర్ ఈ అరుదైన ఫీట్ సొంతం చేసుకున్నాడు.
ఐర్లాండ్ పేస్ అస్త్రమైన కాంఫర్ తన సంచలన ప్రదర్శనతో వార్తల్లో నిలవడం ఇది రెండోసారి. గతంలో లసిత్ మలింగ తర్వాత టీ20ల్లో నాలుగు బంతుల్లో 4 వికెట్లతో వైరలైన ఇతడు ఈసారి అంతకంటే ఒకటెక్కువే అన్నట్టు.. 5 బంతుల్లో ఐదుగురిని పెవిలియన్ పంపాడు.
█▓▒▒░░░HISTORY░░░▒▒▓█
5⃣ WICKETS IN 5⃣ BALLS?
What have we just witnessed Curtis Campher 🤯
SCORE ➡ https://t.co/tHFkXqkmtp#IP2025 pic.twitter.com/UwSuhbvu9k
— Cricket Ireland (@cricketireland) July 10, 2025
ఇంటర్ ప్రావిన్స్ టీ20 ట్రోఫీలో మన్స్టర్ రెడ్ ( Munster Reds) జట్టు సారథిగా బరిలోకి దిగిన కాంఫర్.. నార్త్ వెస్ట్ వారియర్స్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. ఏకంగా ఐదు వికెట్లతో నడ్డివిరిచాడు. దాంతో, 189 పరుగుల ఛేదనకు దిగిన ఆ జట్టు కాఫర్ విజృంభణతో 88 పరుగులకే ప్రత్యర్థి కుప్పకూలింది. ఇంతకుముందు జింబాబ్వేకు చెందిన మహిళా ఆల్‌రౌండర్ కెలిస్ ధులోవ్ (Kelis Ndhlovu) అండర్ -19 మ్యాచ్‌లో ఈ రికార్డు నెలకొల్పింది.