ముంబై : ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర తరచూ పలు ఆసక్తికర అంశాలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తుంటారు. తాజాగా నెక్ట్స్ జనరేషన్ ఆఫ్ టాలెంట్ అంటూ నడిరోడ్డుపై ఓ బాలుడు చేసిన అద్భుత విన్యాసాలతో కూడిన వీడియోను నెట్టింట షేర్ చేశారు. ఈ షార్ట్ క్లిప్‌లో బాలుడు రోడ్డు మధ్యలో గాలిలోకి ఎగురుతూ జంప్ చేస్తూ చేసిన జిమ్నాస్టిక్ విన్యాసాలు ఆకట్టుకున్నాయి.
And after the Gold rush for India at the #CWG2022 the next generation of talent is shaping up. Unsupported. We need to get this talent on the fast track. (This video shared by a friend who has seen this boy in a village near Tirunelveli) pic.twitter.com/DXBcGQjMX0
— anand mahindra (@anandmahindra) August 9, 2022
ఈ టాలెంట్‌ను పాస్ట్ ట్రాక్‌లో మనం పదును పెట్టాల్సిన అవసరం ఉందనే క్యాప్షన్‌తో ఆనంద్ మహీంద్ర పోస్ట్ చేసిన వీడియోకు నెటిజన్ల నుంచి భారీ స్పందన లభిస్తోంది. తమిళనాడులోని తిరునల్వేలి సమీపంలోని ఓ గ్రామంలో విన్యాసాలు చేస్తుండగా తన స్నేహితుల్లో ఒకరు చూసి వీడియోను పోస్ట్ చేశారని ఆనంద్ మహింద్ర పేర్కొన్నారు. కామన్వెల్త్ గేమ్స్2022లో స్వర్ణం గెలుచుకున్న తర్వాత తర్వాతి తరం నైపుణ్యాలు ముందుకొస్తున్నాయని సోషల్ మీడియాలో చెప్పుకొచ్చారు.
ఈ వీడియోకు ఇప్పటివరకూ 1,18,000కిపైగా వ్యూస్ రాగా 6000కు పైగా లైక్స్ వచ్చాయి. ఈ చిన్నారి భవిష్యత్ ప్రపంచ జిమ్నాస్టిక్ చాంపియన్ అని పలువురు నెటిజన్లు ప్రశ్నించగా, ఈ బాలుడికి శిక్షణ ఇప్పించి, భారత ఒలింపిక్స్ టీమ్‌లో చేర్చేలా ఎవరో ఒకరు చొరవ చూపాలని మరికొందరు యూజర్లు వ్యాఖ్యానించారు. ఈ బుడతడు జిమ్నాస్ట్ ట్రిక్స్‌ను ఇప్పటికే నేర్చుకున్నాడని మరో నెటిజన్ ప్రశంసించారు. ఇక ఇండియా రాక్స్, ఫ్యూచర్ సూపర్‌స్టార్ అంటూ మరికొందరు బాలుడిని ఆకాశానికెత్తేశారు.