Viral Video: ఆలయంలోని శివలింగంపై మంచు… మహిమగా పేర్కొన్న భక్తులు
ముంబై: ఒక ప్రసిద్ధ ఆలయంలోని శివలింగంపై మంచు పడింది. ఐస్ మాదిరిగా ఉన్న దీనిని చూసి ఆలయంలోని పూజారితోపాటు భక్తులు ఆశ్చర్యపోయారు. మహారాష్ట్ర నాసిక్ జిల్లాలోని ప్రముఖ త్రయంబకేశ్వర ఆలయంలో ఈ వింత జరిగింది. ఆలయంలోని శివలింగానికి పూజారి పూలతో అర్చన చేశారు. అయితే కొంత సేపటి తర్వాత శివలింగం పైభాగంలో తెల్లగా మంచు మాదిరిగా ఏర్పడింది. దీంతో ఆశ్చర్యపోయిన ఆ పూజరి శివలింగంపైన ఉన్న పూలను తొలగించారు. ఐస్గడ్డ మాదిరిగా ఉన్న మంచును చేతితో తడిమి చూశారు.
కాగా, నరేంద్ర అహెర్ అనే వ్యక్తి తన ట్విట్టర్ ఖాతాలో ఈ వీడియోను శుక్రవారం పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. జమ్ముకశ్మీర్లోని అమర్నాథ్ గుహలో అమరేశ్వర్ మహాదేవ్ రూపంలో ఏర్పడే మంచు శివలింగాన్ని వేలాది మంది భక్తులు ప్రతి ఏటా సందర్శిస్తుంటారు. కరోనా నేపథ్యంలో రెండేళ్ల విరామం తర్వాత పవిత్ర అమర్నాథ్ యాత్ర జూన్ 30న ప్రారంభమైంది. ఈ తరుణంలో త్రయంబకేశ్వర ఆలయంలోని శివలింగంపై మంచుగడ్డ ఏర్పడటాన్ని అద్భుతమని, మహిమ అని కొందరు నెటిజన్లు పేర్కొన్నారు. అయితే మంచును కృతిమంగా రూపొందించి ఉంటారని కొందరు అనుమానం వ్యక్తం చేశారు.
त्र्यंबकेश्वर मंदिर ज्योतिर्लिंगातील महादेवाच्या स्वयंभू शिवलिंगात बर्फ गोठला हा एक नैसर्गिक चमत्कार आहे, तो कधीच घडला नाही अमरनाथ यात्रेला आजपासून सुरुवात झाली असून, त्र्यंबकराजमध्ये देवानेच भक्तांना दर्शन दिल्याची लोकांची श्रद्धा आहे. ❤️🙏 pic.twitter.com/XVFf6VXGuU
— Narendra Aher (@aher_narendra) July 1, 2022
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | ‘జైలర్ 2’పై తెలుగు ప్రేక్షకుల అసంతృప్తి.. ప్రమోషన్లు లేవు, బాలయ్య క్యామియో కూడా మిస్సింగ్!
దళిత యువకుడికి అవమానం.. ఆలయంలోకి వెళ్లినందుకు దూషణలు
Goutham Raju | నా ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం చేయోద్దు.. ఆ వార్తలపై సీనియర్ నటుడు గౌతం రాజు ఆవేదన!
Singareni | బీఆర్ఎస్ పాలన సింగరేణికి స్వర్ణయుగం.. ఉత్పత్తి, ఆదాయం, లాభాల్లో గణనీయ వృద్ధి!
Balmuri Venkat | భూవివాదంలో ఎమ్మెల్సీ బల్మూరి.. ప్రైవేట్ ట్రస్ట్ భూమి కబ్జాకు యత్నం!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

