Viral Photo : అంతరించిపోయే దశలో ఉన్న వన్యప్రాణులను సంరక్షించడం ఎంత ముఖ్యమో చాటడం కోసం కొందరు వాటి ఫొటోలను నెట్లో పెడతారు. అవి అఆన్లైన్లో క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. తాజాగా ఐఏఎస్ ఆఫీసర్ సుప్రియా సాహూ ట్విట్టర్లో షేర్ చేసిన నీలగిరి తహర్ ఫొటోలు సోషల్మీడియాలో తెగ తిరుగుతున్నాయి. ‘నిజమైన ఖత్రోం కే ఖిలాడీ. పశ్చిమ కనుమల్లోని షోల పచ్చికబయళ్లలో నివసిస్తాయి. ఎత్తైన కొండల్ని కూడా అవలీలగా ఎక్కుతాయి. వీటి సంరక్షణకు తమిళనాడు ప్రభుత్వం ప్రాజెక్టు మొదలు పెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది ‘ అంటూ ఆ ఫొటోలకు ఆమె క్యాప్షన్ పెట్టారు. అందులోని ఒక ఫొటోలో పచ్చదనం పరుచుకున్న నీలగిరి కొండల మీదున్న ఒక చెట్టు కొమ్మ మీద తహర్ ఒకటి నిల్చొని ఉంది. మరికొన్ని ఆ పక్కనే ఉన్న కొండ మీద నిల్చొని ఉన్నాయి. అంతరించిపోయే దశలోని జంతువు ఫొటోలు షేర్ చేసిన
తమిళనాడు రాష్ట్ర జంతువు అయిన తహర్ అంతరించిపోయే దశలో ఉంది. దాంతో, ఈ జంతువును సంరక్షించేందుకు తమిళనాడు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఒవిస్ జాతికి చెందిన గొర్రెలను పోలిన వీటి కొమ్ములు వంపు తిరిగి ఉంటాయి. ఇవి నీలగిరి అడువుల్లోనే ఎక్కువగా కనిపిస్తాయి.
The real Khatron ke khiladi – Nilgiri Tahr – endemic to shola grasslands of western Ghats- climbs steepest cliffs with ease. So happy that a dedicated project has been announced by the Govt. of TN for its conservation. #ProjectNilgiriTahr pics- Dhanuparan pic.twitter.com/pNf1xrJR3J
— Supriya Sahu IAS (@supriyasahuias) December 29, 2022