Husband Of The Year | మహిళలు మేకప్‌కు ఎంత ప్రాధాన్యం ఇస్తారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఏదైనా ఫంక్షన్‌కు, షాపింగ్‌కు వెళ్తున్నామంటే చాలు.. గంటలతరబడి అద్దానికి అతుక్కుపోతారు. మ్యాచ్‌ను వీక్షించేందుకు వెళ్లిన ఓ మహిళ కూడా ఇలానే మంచిగా మేకప్ వేసుకుని వెళ్లింది. అంతటితో సరిపోలేదనుకుందో ఏమో..? మ్యాచ్ మధ్యలో మరోసారి తన అందానికి మెరుగులు దిద్దుకుంటూ కనిపించింది. ఇందుకు ఆమె భర్త సాయం చేయడం విశేషం.
లైవ్ మ్యాచ్‌కోసం స్టేడియంకి వెళ్లిన ఓ జంట.. గ్యాలరీలో కూర్చొని మ్యాచ్‌ను తిలకిస్తున్నారు. ఈ క్రమంలో భార్య మ్యాచ్ మధ్యలో మరోసారి తన కళ్లకు ఐలనర్ వేసుకుంటూ ఉంటుంది. అందుకు ఆమె భర్త తన ఫోన్‌ను అద్దంలా పట్టుకుని హెల్ప్ చేస్తాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఓ నెటిజన్ ట్విట్టర్లో పోస్టు చేశాడు. ‘హస్బెండ్ ఆఫ్ ది ఇయర్..’ అంటూ క్యా్ప్షన్ ఇచ్చాడు. ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
Husband of the year 😅❤️ pic.twitter.com/ISuozoyDQA
— ज़िन्दगी गुलज़ार है ! (@Gulzar_sahab) December 16, 2022