Neeraj Chopra : నీరజ్‌కు అభినందనలు.. ఈరోజు ఆటో రైడింగ్ ఫ్రీ
Neeraj Chopra : ఒలింపిక్స్‌లో పసిడి పతకం సాధించి చరిత్ర తిరగరాసిన నీరజ్ చోప్రాకు అభినందనగా.. ఆదివారం తన ఆటోలో ఫ్రీ రైడింగ్ ఇచ్చేందుకు ముందుకొచ్చాడు చండీఘడ్‌కు చెందిన ఓ ఆటో డ్రైవర్. ఈ రోజు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎవరైనా తన ఆటోలో ఉచితంగా ప్రయాణించవచ్చునంటున్నాడు అనిల్ కుమార్ అనే ఆటో డ్రైవర్

చండీఘడ్ : ఒలింపిక్స్‌లో పసిడి పతకం సాధించి చరిత్ర తిరగరాసిన నీరజ్ చోప్రాకు అభినందనగా.. ఆదివారం తన ఆటోలో ఫ్రీ రైడింగ్ ఇచ్చేందుకు ముందుకొచ్చాడు చండీఘడ్‌కు చెందిన ఓ ఆటో డ్రైవర్. ఈ రోజు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎవరైనా తన ఆటోలో ఉచితంగా ప్రయాణించవచ్చునంటున్నాడు అనిల్ కుమార్ అనే ఆటో డ్రైవర్. గత కొన్నేండ్లుగా ఆర్మీ పర్సనల్, గర్భిణులను ఉచితంగా తీసుకెళ్తూ శహబాష్ అనిపించుకుంటున్నాడు.
ఒకవైపు కొవిడ్ వ్యాప్తి భయాలు ఉన్నప్పటికీ క్రీడాకారులు తమ ప్రాక్టీస్‌ను కొనసాగించారని, అందుకే వారీ స్థాయికి చేరుకున్నారని అనిల్ కుమార్ అన్నాడు. చండీఘడ్‌లో చదువుకుని, ఆటల్లో ఓనమాలు దిద్దిన నీరజ్ చోప్రా.. ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించడం తమకు గర్వకారణమంటున్నాడు. నీరజ్ పతకాన్ని సాధించినందుకు సంతోషం ఉన్నందున తన ఆటోలో ఈ రోజు (ఆదివారం) ఉచితంగా ప్రయాణించేందుకు అవకాశం కల్పిస్తున్నానని చెప్పాడు. సాధారణంగా ఒక ఆటోడ్రైవర్ రోజులో 150 కిలీమీటర్లు ఆటో నడిపి రూ.500 వరకు సంపాదిస్తారని, తాను సంపాదించే ఈ మొత్తాన్ని పతకం సాధించిన తీపి గుర్తుకు వెచ్చించడం ఎంతో సంతోషకరంగా ఉన్నదని చెప్తున్నాడాయన.
ఆర్మీ జవాన్లు, గర్భిణులను తన ఆటోలో ఉచితంగా తీసుకెళ్లడం మహద్ భాగ్యంగా భావిస్తానంటున్నాడు. నగరంలోని ఇరుకైన వీధుల్లో నుంచి సమయానికి పెద్ద దవాఖానలకు వెళ్లలేని గర్భిణులను అనిల్ తన ఆటో ద్వారా ఉచితంగా తీసుకెళ్తూ సేవలందిస్తున్నాడు.
ఇవి కూడా చదవండి..
క్విట్ ఇండియా ఉద్యమానికి 79 ఏండ్లు
లండన్‌లో డెల్టా వేరియంట్ డేంజర్ బెల్స్..
గోల్డెన్ మ్యాన్ నీరజ్ చోప్రాకు ఈ ఫుడ్ అంటే ఇష్టమంటా..!
ఓలా స్కూటర్లో రివర్స్ గేర్..
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

