పెళ్లి గురించి మాట్లాడమని లింక్ పంపితే.. అబ్బాయిని ఇంటర్వ్యూ చేసిన అమ్మాయి.. వైరల్ అవుతున్న తండ్రి రియాక్షన్
ఒకప్పుడు పెళ్లి చూపులు అంటే రెండు కుటుంబాలు కలిసి కూర్చుంటే.. అబ్బాయి, అమ్మాయి ఒకరివైపు ఒకరు సిగ్గు పడుతూ చూడాలా? వద్దా? అన్నట్లు ఓర చూపులు చూసుకుంటూ జరిగిపోయేవి. పెద్దవాళ్లు ‘‘ఊ’’ అంటే పెళ్లి జరిగేది.. ‘‘ఊహూ’’ అంటూ స్వీట్స్ తిని వెళ్లిపోయేవాళ్లు. కానీ ఇప్పుడు కాలం మారింది. ఫొటోలు, ఫోన్ నెంబర్ల నుంచి అన్నీ ఆన్లైన్లోనే జరిగిపోతున్నాయి.
పెళ్లి చూపుల ఫస్ట్ ఫేజ్ కూడా మ్యాట్రిమోనియల్ సైట్లలోనే పూర్తయిపోతోంది. అయితే మనం ఇప్పుడు చెప్పుకునే అమ్మాయి మరో అడుగు ముందుకేసి.. తను మాట్లాడాల్సిన అబ్బాయిని ఇంటర్వ్యూ చేసింది. వింతగా ఉంది కదూ వినడానికి? కానీ ఇది నిజమే. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరుకు చెందిన సాల్ట్ అనే కంపెనీ సహవ్యవస్థాపకురాలైన ఉదిత పాల్ అనే యువతికి పెళ్లి కాలేదు. ఆమెకు ఒక మ్యాట్రిమోనియల్ లింక్ పంపిన తండ్రి.. అబ్బాయితో మాట్లాడమని కూతురికి చెప్పాడు.
సరేనని ఆ లింక్ ద్వారా అబ్బాయిని కాంటాక్ట్ అయింది ఉదిత. మాటల మధ్యలో అతని చదువు, ఉద్యోగానుభవం అన్నీ తెలుసుకుంది. ఆ వెంటనే తమ కంపెనీలో ఖాళీలు ఉన్నాయని చెప్పి రెజ్యూమ్ పంపించాలని కోరింది. అతని రెజ్యూమ్ చూసిన తర్వాత ఇంటర్వ్యూ లింక్ పంపింది. అక్కడితో వాళ్ల సంభాషణ ఉద్యోగం గురించి వెళ్లి తర్వాత ముగిసింది.
విషయం తెలిసిన తండ్రి రియాక్షన్ ఏంటంటే?
ఈ విషయం ఉదిత తండ్రికి తెలిసింది. అంతే కుమార్తెకు వాట్సాప్‌లో మెసేజ్ పెట్టాడు. ‘‘అబ్బాయితో మాట్లాడమని చెప్తే.. ఇంటర్వ్యూ చేస్తావా? రెజ్యూమ్ తెప్పించుకొని, ఇంటర్వ్యూ లింక్ కూడా పంపావు. ఇప్పుడు వాళ్ల నాన్నకు నేను ఏం సమాధానం చెప్పాలి? సమాధానం చెప్పవే క్రేజీ గర్ల్’’ అంటూ మండిపడ్డాడు.
దానికి సమాధానం ఇచ్చిన ఉదిత.. ‘‘ఏడేళ్ల ఫిన్‌టెక్ అనుభవం ఉండటం చాలా గొప్ప విషయం. మా కంపెనీలో ఖాళీలు ఉన్నాయి. ఐయామ్ సారీ’’ అంటూ రిప్లై ఇచ్చింది. ఈ చాట్‌ను స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో తెగ వైరల్ అవుతోంది. ఇది చూసిన వారందరూ నవ్వలేక చస్తున్నామంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి ఇంతకీ అతన్ని హైర్ చేసుకున్నారా? అని అడగ్గా.. ఉదిత సమాధానం ఇచ్చింది. మొత్తానికి 62 ఎల్పీఏ ప్యాకేజ్ అడిగాడని, అంత పెట్టి హైర్ చేసుకోలేక ఉద్యోగం ఇవ్వలేదని సమాధానం చెప్పింది.
What getting disowned from father looks like. pic.twitter.com/nZLOslDUjq
— Udita Pal 🧂 (@i_Udita) April 29, 2022
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

